చిరంజీవి సూపర్ హిట్ మూవీ టైటిల్ పై కన్నేసిన హీరో కార్తి!  

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ టైటిల్ ని వాడేస్తున్న హీరో కార్తి. .

Hero Karthi Use Megastar Super Hit Movie Title-kaithi Movie,kollywood,megastar Super Hit Movie Title,tollywood

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో సూపర్ హిట్ మూవీ, అలాగే అతని కెరియర్ కి టర్నింగ్ ఇచ్చిన మూవీ ఖైది. ఈ సినిమా ముందు వరకు ఓ మామూలు హీరోగా వున్న చిరంజీవి ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. అతని కెరియర్ లో ఇప్పటికే నెంబర్ వన్ చిత్రంగా ఖైదినే చెప్పుకుంటారు...

చిరంజీవి సూపర్ హిట్ మూవీ టైటిల్ పై కన్నేసిన హీరో కార్తి!-Hero Karthi Use Megastar Super Hit Movie Title

అలాంటి హిట్ సినిమా టైటిల్ ని మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు ఉపయోగించే ధైర్యం చేయలేదు. ఇదిలా వుంటే తాజాగా మళ్ళీ ఆ టైటిల్ తో తమిళ స్టార్ హీరో కార్తి ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.తమిళ, తెలుగు సినిమాలలో తనదైన ముద్ర వేసిన కార్తి తాజాగా దేవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఇదిలా వుంటే తాజాగా అతని కొత్త సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు. ఇక మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ అయిన ఖైదిని ఈ సినిమా కోసం దర్శకుడు లోకేష్ వాడుకుంటున్నాడు. ఇక ఇది ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.

ఇప్పటికే నాని, మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ అయిన గ్యాంగ్ లీడర్ ని వాడేస్తున్నాడు. ఇప్పుడు కార్తి కూడా మరో సూపర్ హిట్ మూవీ టైటిల్ ని వాడుకుంటున్నారు. మరి మెగాస్టార్ సూపర్ హిట్ టైటిల్స్ వీళ్ళకి ఎలా ఉపయోగపడతాయి అనేది చూడాలి.