కళ్యాణ్‌ రామ్‌ మరోటి ఓకే చేశాడు

‘పటాస్‌’తో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ దాదాపు పది సంవత్సరాల తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘పటాస్‌’ నిలిచింది.

 Ravi Kumar Chowdary To Direct Kalyan Ram-TeluguStop.com

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఇకపై సేఫ్‌ ప్రాజెక్ట్‌లు మాత్రమే చేస్తాడని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఈయన తన తర్వాత సినిమాను రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడు.

ఈయన ఒక్క హిట్‌ రెండు ఫ్లాప్‌లు అంటూ కెరీర్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఈయనతో సినిమా చేసేందుకు ఒప్పుకుని అందరిని షాక్‌కు గురి చేశాడు నందమూరి హీరో.

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా చేసి యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పటికే నందమూరి కళ్యాణ్‌ రామ్‌కు కథ చెప్పడం, ఆ కథకు కళ్యాణ్‌ రామ్‌ ఓకే చెప్పడం కూడా జరిగిందని తెలుస్తోంది.కళ్యాణ్‌ రామ్‌ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా, త్వరలో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరి ‘పటాస్‌’తో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిన కళ్యాణ్‌ రామ్‌ ఆ సక్సెస్‌ను కొనసాగించేనో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube