కళ్యాణ్ రామ్ లాంటి మరో హీరో ఉంటారా.. ఆ విషయంలో చాలా గ్రేట్ అంటూ?

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో ఏ హీరో అయినా సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు.ఇప్పటికే ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ దర్శకుడి సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే ప్రాజెక్ట్ లను క్యాన్సిల్ చేసుకోవడానికి హీరోలు సిద్ధంగా ఉన్నారు.

 Hero Kalyan Ram Great In That Matter Details, Kalyan Ram, Nandamuri Kalyan Ram,-TeluguStop.com

అయితే కళ్యాణ్ రామ్ మాత్రం సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లను పెద్దగా పట్టించుకోవడం లేదు.కెరీర్ తొలినాళ్ల నుంచి భిన్నమైన కథలకు కళ్యాణ్ రామ్ ఓకే చెబుతున్నారు.

మల్లిడి వేణు డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార తొలిరోజే 2 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుని ప్రీ రిలీజ్ బిజినెస్ లో 40 శాతంకు పైగా రికవరీ చేసింది.స్టార్ డైరెక్టర్లతో పని చేయకుండానే కళ్యాణ్ రామ్ ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

పూరీ జగన్నాథ్ మాత్రమే కళ్యాణ్ రామ్ తో పని చేసిన స్టార్ డైరెక్టర్ కాగా ఈ కాంబినేషన్ లో వచ్చిన ఇజం మూవీ ఫ్లాప్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

Telugu Abhi Manyudu, Athanokkade, Bimbisara, Vasisth, Matter, Kalyan Ram, Nandam

యంగ్ డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డికి అతనొక్కడే సినిమాకు పని చేసే ఛాన్స్ ఇచ్చి ఆ సినిమాతో కళ్యాణ్ రామ్ సక్సెస్ ను అందుకున్నారు.బాలకృష్ణతో ఫ్లాప్ సినిమా తీసిన హర్షవర్ధన్ అనే డైరెక్టర్ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హరే రామ్ లో నటించారు.తనతో తీసిన అభిమన్యు ఫ్లాప్ అయినా దర్శకుడు మల్లిఖార్జున్ కు కళ్యాణ్ రామ్ మరో ఛాన్స్ ఇచ్చారు.

Telugu Abhi Manyudu, Athanokkade, Bimbisara, Vasisth, Matter, Kalyan Ram, Nandam

ఓం త్రీడీ సినిమాతో సునీల్ రెడ్డిని కళ్యాణ్ రామ్ దర్శకునిగా పరిచయం చేశారు.పటాస్ తో అనిల్ రావిపూడికి, 118తో గుహన్ కు కళ్యాణ్ రామ్ సక్సెస్ ఇచ్చారు.బింబిసారతో వశిష్ట కూడా పాపులర్ అయ్యారనే సంగతి తెలిసిందే.కళ్యాణ్ రామ్ ఈ విషయంలో గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube