నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ డైరక్షన్ లో వస్తున్న సినిమా బింబిసార.ఈ సినిమాను ఎన్.
టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.సినిమా ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచగా బింబిసారా 17వ దశాబ్ధ కథతో వస్తుందని తెలుస్తుంది.సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుంది.
ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
బాలయ్య బాబుకి ఆదిత్య 369 లానే కళ్యాణ్ రామ్ కు బింబిసారా అంటూ ప్రచారం మొదలు పెట్టారు.
భారీ బడ్జెట్ తో సినిమా భారీ అంచనాలతో వస్తుంది.మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది.
సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్, డైలాగ్స్ అన్ని చాలా స్పెషల్ గా ఉండేలా చూస్తున్నారు.తప్పకుండా కళ్యాణ్ రామ్ బింబిసారా నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు.
ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. కళ్యాణ్ రాం మాత్రం ఈ బింబిసారా మీద ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.
తన దృష్టి మొత్తం దాని మీదే పెట్టి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.