కళ్యాణ్‌ రామ్‌ మళ్లీ కొంగొత్త ప్రయోగం.. ఎన్ని చేసినా ఫలితం ఏది       2018-07-04   23:51:43  IST  Raghu V

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈమద్య కాలంలో ‘ఎమ్మెల్యే’ మరియు ‘నా నువ్వే’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడ్డాయి. భారీ డిజాస్టర్స్‌గా ఆ చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అయినా కూడా ఏమార్రతం నిరుత్సాహం చెందకుండా కళ్యాణ్‌ రామ్‌ వరుసగా చిత్రాలు చేసుకుంటూ వస్తున్నాడు. తన ప్రతి సినిమాలో కూడా కొత్తగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కళ్యాణ్‌ రామ్‌ తాజాగా మరో కొంగొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

కళ్యాణ్‌ రామ్‌ ఇప్పటి వరకు 15 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ గుహన్‌ దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని కళ్యాణ్‌ రామ్‌ చేస్తున్నాడు. ఆ సినిమాను మహేష్‌ కోనేరు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ‘నా నువ్వే’ చిత్రంలో లవర్‌బాయ్‌గా కనిపించిన కళ్యాణ్‌ రామ్‌ ఈ చిత్రంలో మరో విభిన్నమైన గెటప్‌తో ఆకట్టుకునేందుకు సిద్దం అవుతుంది. తాజాగా కళ్యాణ్‌ రామ్‌ బర్త్‌డే సందర్బంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయడం జరిగింది.

ఫస్ట్‌లుక్‌లో కళ్యాణ్‌ రామ్‌ లుక్‌ చాలా బాగుందని, చాలా స్టైలిష్‌గా ఉన్నాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది. ‘మిర్చి’ చిత్రంలో ప్రభాస్‌ ఏ రేంజ్‌ స్టైల్‌తో ఆకట్టుకున్నాడో అలాగే ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ అదే రేంజ్‌ స్టైలిష్‌ లుక్‌తో కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌ుక్‌తోనే తేలిపోయింది. సినిమాల్లో లుక్స్‌ సూపర్‌. కాని సినిమాలు మాత్రం అంతగా ఆడటం లేదు. వరుసగా చిత్రాలు చేస్తున్న కళ్యాణ్‌ రామ్‌ నందమూరి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పర్చుతున్నాడు.

తమ్ముడు ఎన్టీఆర్‌ సాయంతో తన ప్రతి సినిమాకు భారీ పబ్లిసిటీని చేసుకుంటున్న కళ్యాణ్‌ రామ్‌ ఆ పబ్లిసిటీని ఎన్‌ క్యాష్‌ చేసుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నాడు. మొత్తానికి కళ్యాణ్‌ రామ్‌ చిత్రం ‘నా నువ్వే’ ఫ్లాప్‌ అయినా కూడా కొత్త లుక్‌ కారణంగా తాజా చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందా లేదా గత చిత్రాల ఫలితాన్ని ఈ చిత్రం చవి చూస్తుందా అనేది కొన్ని వారాల్లో తేలిపోయే అవకాశం ఉంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కాని ఈ చిత్రం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి.