షూటింగ్‌లో గాయపడ్ద హీరో.. ఆస్పత్రికి తరలించిన చిత్ర యూనిట్.. అతను ఎవరంటే.. ?

సినిమా చిత్రీకరణ అనగానే హాడావుడితో పాటుగా అపాయాలు కూడా ఉంటాయని ఎన్నో సందర్భాల్లో జరిగిన ప్రమాదాలను గమనిస్తే అర్ధం అవుతుంది.తెరమీద హీరోలా వెలిగే వారి కష్టాలు షూటింగ్ సమయంలో చూస్తే తెలుస్తుంది.

 Hero Injured In-TeluguStop.com

ఇకపోతే ప్ర‌స్తుతం మ‌ల‌య‌న్ కుంజ్ అనే చిత్రంలో న‌టిస్తున్న ప్రముఖ మలయాళ హీరోకు ప్రమాదం జరిగింది.ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా వేసిన ఓ ఇంటి సెట్‌ పై నుండి దూకే సీన్ చిత్రీకరిస్తున్న స‌మ‌యంలో అనుకోకుండా ఈ చిత్ర హీరో ప‌హాద్ కింద ప‌డ్డాడు.

వెంట‌నే అప్రమత్తమైన చిత్ర యూనిట్ అత‌డిని కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు.

 Hero Injured In-షూటింగ్‌లో గాయపడ్ద హీరో.. ఆస్పత్రికి తరలించిన చిత్ర యూనిట్.. అతను ఎవరంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ ప్రమాదంలో ప‌హాద్ ముక్కుకు గాయాలు అయ్యాయ‌ని, ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని సమాచారం.

మొత్తానికి చిన్న చిన్న గాయాలతో ఈ ప్ర‌మాదం నుండి ఆయన బయట పడినట్లుగా తెలుస్తోంది.ఇకపోతే ఈ మలయాళ నటుడు బెంగ‌ళూరు డేస్, ట్రాన్స్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే.

#Malayalam #Injured #Shooting #Fahad Fazil #Actor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు