బండిలో పెట్రోల్‌ పూర్తిగా తీసేసి కూల్‌ డ్రింక్‌ పోశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా  

Hero Honda Glamour Bikes Fuel Tank Filled With Coca Cola-hero Honda Glamour Bikes,telugu Viral News Updates,viral In Social Meida

ఇండియాలో పెట్రోల్‌ రేట్లు మండి పోతున్నాయి. గత పది సంవత్సరాల్లో పెట్రోల్‌ రేట్లు దాదాపుగా 250 శాతం పెరిగినట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఇంత భారీగా పెట్రోలు రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో బండ్లు కొనుగోలు చేయాలనుకునే వారు భయపడుతున్నారు. బండి కొనడం సమస్య కాదు కాని దాన్ని మెయింటెన్స్‌ కోసం మరియు పెట్రోలు కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని మద్యతరగతి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

బండిలో పెట్రోల్‌ పూర్తిగా తీసేసి కూల్‌ డ్రింక్‌ పోశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా-Hero Honda Glamour Bikes Fuel Tank Filled With Coca Cola

పెట్రోలు మరియు డీజిల్‌ రెండు కూడా విపరీతంగా రేట్లు పెరిగిన నేపథ్యంలో కొందరు బండ్లకు దూరంగా ఉంటున్నారు. పెట్రోలు రేట్లు ఇంతగా పెరిగిన నేపథ్యంలో ఒక మెకానిక్‌ వింత ప్రయత్నం చేశాడు.

కూల్‌డ్రింగ్స్‌లో పురుగుల మందు ఉందని కొందరు పైరుకు పిచికారీ చేస్తున్నారు. మరి కొందరు రకరకాలుగా కోకకోలా మరియు థంప్సప్‌లను వినియోగిస్తూ ఉన్నారు.

తాజాగా ఈ యువకుడు తన బండ్లో కోకాకోలా పోసి నడిపించేందుకు ప్రయత్నించాడు. ప్రయోగం చేస్తే పోయేది ఏముంది ఒక కోకాకోలా బాటిల్‌ పోతుంది కదా అనుకుని ప్రయోగం చేశాడు. హీరో హోండా పాత గ్లామర్‌ బండిని తీసుకున్న ఆ వ్యక్తి అందులో ఉన్న పెట్రోల్‌ అంతటిని తీసేయడం జరిగింది..

ఆ తర్వాత రెండు లీటర్ల కోకాకోలా సీల్డ్‌ బాటిల్‌ను ఓపెన్‌ చేసి పూర్తిగా అందులో పోశాడు.

కోకాకోలా పోసిన తర్వాత బండిని స్టార్ట్‌ చేశాడు. బండి స్టార్ట్‌ అయ్యింది. దాదాపు కిలో మీటరు వరకు వెళ్లింది.

ఆ తర్వాత ఆగిపోయింది. బండిలో ఉండే కార్పెంటర్‌లో ఉన్న పెట్రోల్‌ వరకు బండి నడిచింది. ఎప్పుడైతే కార్పెంటర్‌లో పెట్రోల్‌ పూర్తి అయ్యి కోకాకోలా వచ్చిందో వెంటనే బండి ఆగిపోయింది..

దీన్ని బట్టి అతడు పెట్రోల్‌ బండి కోకాకోలాతో నడవదని, కోకాకోలాలో ఉండే గ్యాస్‌ మరియు ఇతరత్రాల వల్ల పని జరుగుతుందేమో అని ప్రయత్నించాను కాని ఇది వర్కౌట్‌ అవ్వడం లేదు అంటూ చెప్పి తన వీడియోను ముగించాడు. ఇతడి వీడియోకు మిశ్రమ స్పందన వస్తుంది. ఇదో పిచ్చి ప్రయోగం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తే మరి కొందరు ఇలాంటి విభిన్నమైన ఆలోచన వచ్చినందుకు నీవు అభినందనీయుడివి అంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు.

మొత్తానికి అతడి వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మీరు ఒక లుక్కేయండి.