'మిస్సింగ్' నా డెబ్యూ ఫిల్మ్ కావడం అదృష్టంగా భావిస్తా - హీరో హర్ష నర్రా

మిస్సింగ్ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు హర్షా నర్రా.“మిస్సింగ్” చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు.

 Hero Harsha Narra About Missing Movie As His Debut Film, Hero Harsha Narra ,miss-TeluguStop.com

నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ నాయికలుగా నటించారు.శ్రీని జోస్యుల దర్శకుడు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా హర్ష నర్రా మాట్లాడుతూ.

దీక్షిత్ మాస్టర్ గారి దగ్గర యాక్టింగ్ కోర్సు చేశాను.నాగేశ్వరరావుగారి దగ్గర మెడల్ తీసుకున్నాను.

యాక్టర్ అవ్వాలనేది నా కల.ఫ్యామిలీ బ్యాక్ గ్రాండ్ లేదు కాబట్టి ముందు చదువుకుని యాక్టింగ్ వైపు వచ్చాను.ఆకాశమంత ప్రేమ అనే షార్ట్ ఫిలిం చేశాను.నిహారిక కొణిదెల గారితో ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ చేశాను.పెళ్లి గోల వెబ్ సిరీస్ తో నాకు పేరొచ్చింది.ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను.

అప్పుడు దర్శకుడు శ్రీని జోస్యుల ఒక హీరో కోసం చూస్తున్నారు.మా పరిచయం జరిగాక మిస్సింగ్ సినిమాకు నేను సరిపోతాని భావించి సెలెక్ట్ చేసుకున్నారు.

అలా ఈ చిత్రం స్టార్ట్ అయ్యింది.

యాక్టర్ గా నన్ను నేను ప్రూవు చేసుకోవాలని అనుకున్నాను.

అందుకే నేను చేసే ఫస్ట్ సినిమా చాలా ఇంపార్టెంట్.అందుకే ఒక రేర్ అటెంప్ట్ చేయాలనే ఇలాంటి ప్రాజెక్ట్ తొలి చిత్రంగా ఎంచుకున్నాను.

కుటుంబమంతా సినిమా చూడాలి అనేది నా ఉద్దేశం.మిస్సింగ్ లో గౌతమ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను.

రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, సస్పెన్స్ ఉంటుంది.అందుకే మిస్సింగ్ వదులుకోకూడదు అనుకున్నాను.

Telugu Narra Srinu, Debut, Srini, Harshanarra, Harsha Narra, Mikisha, Nikisha Na

గౌతమ్ కొత్తగా పెళ్లైన వ్యక్తి.ఒక యాక్సిడెంట్ తర్వాత తన భార్య శృతి కనిపించకుండా పోతుందా.ఆమె ఎమైంది అనే సెర్చ్ లో నుంచి కథ బిగిన్ అవుతుంది.డిఫరెంట్ లేయర్డ్ స్టోరి.ప్రతి క్యారెక్టర్ కు ఒక నేపథ్యం ఉంటుంది.దర్శకుడు శ్రీని చాలా స్పష్టతతో సినిమా చేశాను.

గతం మర్చిపోయే అంశాలూ ఉంటాయి.మిస్సింగ్ అనే నేపథ్యంతో వచ్చిన గత ఏ చిత్రాలతోనూ ఈ సినిమాకు పోలిక ఉండదు.

ఇది కొత్త తరహా కథ.నెక్ట్ సీన్ ఎలా ఉంటుందో అనే సస్పెన్స్ లాస్ట్ వరకు సస్టెన్ అవుతుంది.నికీషా, మిషా ఇద్దరూ తెలుగు వాళ్లు కాదు.అయినా లాంగ్వేజ్ మీద చాలా పట్టు తెచ్చుకున్నారు.చాలా కష్టపడి అంకితభావంతో పనిచేశారు.వీళ్లద్దరూ మంచి యాక్ట్రెస్ అని చెప్పొచ్చు.

అజయ్ అరసాడ సంగీతం మిస్సింగ్ మూవీకి సోల్ అనుకోవచ్చు.ట్రైలర్, సాంగ్స్ లో మీరు అతని టాలెంట్ తెలుసుకోవచ్చు.అజయ్ కు సంగీతం ఒక గిఫ్ట్ అనుకోవచ్చు.మిస్సింగ్ తో అతనికి మంచి పేరు వస్తుంది.

థ్రిల్లర్ మూవీలో సాంగ్స్ స్పీడ్ బ్రేక్ అనుకుంటారు కానీ మిస్సింగ్ లో పాటలు ఉన్నా, అవి కూడా కథతో పాటే సాగుతుంటాయి.

Telugu Narra Srinu, Debut, Srini, Harshanarra, Harsha Narra, Mikisha, Nikisha Na

మంచి చిత్రంలో భాగం కావాలని కోరుకున్నందుకు మా నాన్న కూడా మిస్సింగ్ సినిమా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యారు.శ్రీని జోస్యుల కొత్త దర్శకుడు అయినా ఆయనకు ఇండస్ట్రీలో మంచి అనుభవం ఉంది.కథ మీద పట్టున్న దర్శకుడు.

స్క్రీన్ మీద తనకు ఏం కనిపించాలి అనేది చాలా క్లియర్ గా ఉంటాడు.అందరి సలహాలు తీసుకున్నా, తను అనుకున్నది తెరపైకి తీసుకొస్తాడు.

మిస్సింగ్ కోవిడ్ ముందు చేసిన చిత్రం.సినిమాను థియేటర్లో చూసేందుకే ఇష్టపడుతుంటాను.మిస్సింగ్ చిత్రాన్ని థియేటర్ కోసమే చేశాం.థియేటర్ ఎక్సీపిరియన్స్ కోసమే కష్టపడి క్వాలిటీగా తెరకెక్కించాం.

అందుకే ఓటీటీ ఆఫర్స్ వచ్చినా, థియేటర్ రిలీజ్ కోసమే వేచి చూశాం.

Telugu Narra Srinu, Debut, Srini, Harshanarra, Harsha Narra, Mikisha, Nikisha Na

యాక్టర్ నర్రా శ్రీను మా బాబాయ్.అయితే ఆయన నీ ప్రయత్నాలు నువ్వు చేసుకోవాలి, అప్పుడే సొంతంగా ఎదుగుతావు అని చెప్పారు.అలా నేను స్వతహాగా ప్రయత్నాలు చేస్తున్నాను.

ఈ తరహా జానర్ ఫిల్స్మ్ చేయాలనే పరిధులు పెట్టుకోలేదు.అన్ని రకాల చిత్రాలు చేయాలనే అనుకుంటున్నాను.

ప్రస్తుతం ఇంకొన్ని కథలు వింటున్నాను.కొత్త సినిమాను అనౌన్స్ చేస్తాను.

సినిమా కోసమే వెబ్ సిరీస్ ఆఫర్స్ వస్తున్నా పక్కనపెడుతున్నాను.సినిమాకే నా మొదటి ప్రాధాన్యం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube