‘బాహుబలి’లో మరో హీరో?

సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘బాహుబలి’ సినిమాలో చిన్న పాత్రలో అయినా నటించాలని స్టార్‌ హీరోలు సైతం కోరుకుంటున్నారు.ఆ మధ్య తమిళ స్టార్‌ హీరో సూర్య తనకు చిన్న పాత్ర అయినా ఇవ్వాలని స్వయంగా రాజమౌళిని అడగటం జరిగింది.

 Gopichand In Baahubali 2?-TeluguStop.com

అంతటి క్రేజ్‌ ఉన్న ‘బాహుబలి’ సినిమాలో హీరో గోపీ చంద్‌ ఒక ముఖ్య పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ సినిమా రెండవ పార్ట్‌లో గోపీచంద్‌ కనిపిస్తాడు అని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

‘బాహుబలి’ హీరో ప్రభాస్‌కు గోపీచంద్‌తో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి.

ఆ సంబంధంతోనే రాజమౌళికి ఒక పాత్రకు గోపీచంద్‌ పేరును సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది.చిన్న పాత్ర అయినా ముఖ్యమైన పాత్ర అవ్వడంతో పాటు, ఆ పాత్రకు గోపీచంద్‌ సరిగ్గా సూట్‌ అవుతాడు అనే ఉద్దేశ్యంతో రాజమౌళి ప్రభాస్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయడం జరిగింది.

ఈ విషయంపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.మరో వైపు గోపీచంద్‌ వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు.

ఈయన నటించిన ‘సౌఖ్యం’ చిత్రం ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఎంతో మంది కోరుకుంటున్న ‘బాహుబలి’ సినిమాలో నటించే అవకాశం రావడంతో గోపీచంద్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నాడు.

‘బాహుబలి’లో చిన్న పాత్ర అయినా కూడా గోపీచంద్‌ దశ తిరిగే ఛాన్స్‌ ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube