గోపీచంద్.. శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబో ఫిక్స్..!

మ్యాన్లీ హీరో గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సంపత్ నంది డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

 Gopichand Sriwas Hattrick Combination Movie Confirmed, Gopichand, Combinatiion,-TeluguStop.com

సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాతో పాటుగా మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ జాలీ ఎల్.ఎల్.బి 2కి రీమేక్ గా ఈ సినిమా వస్తుంది.ఇక లేటెస్ట్ గా మరో సినిమా కన్ఫర్మ్ చేశారు గోపీచంద్.

డైరక్టర్ శ్రీవాస్ కాంబోలో సినిమా చేస్తున్నారు గోపీచంద్.ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి లక్ష్యం, లౌక్యం సినిమాలు చేశారు.రెండు సినిమాలు మంచి హిట్ సాధించాయి.శ్రీవాస్ డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ మూవీ ఫిక్స్ అయ్యింది.

ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది.

Telugu Confirmed, Gopichand, Hattrick, Lakshyam, Latest, Loukyam, Factory, Sriva

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఎలాగైనా సరే మళ్లీ కెరియర్ ను ట్రాక్ ఎక్కించాలని ప్రయత్నిస్తున్నాడు గోపీచంద్.గోపీచంద్ కెరియర్ లో 30వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ వస్తుండటం విశేషం.

మరి ఈ సినిమాలతో అయినా గోపీచంద్ అనుకున్న సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube