పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ వేదికగా కన్నడ స్టార్ హీరోకు ఘోర అవమానం..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం.కన్నడ సినిమా పరిశ్రమతో పాటు దేశ సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

 Hero Darshan Insulted By Karnataka Police Details, Hero Darshan, Kannada Star He-TeluguStop.com

సినిమాల్లో నటించడమే కాదు.ఎన్నో సామాజిక సేవలు చేస్తూ జనాల్లో దేవుడిగా నిలిచిపోయాడని చెప్పారు.

ఈ నెల 16న బెంగళూరులో భారీ సంస్మరణ జరిగింది.ఈ కార్యక్రమానికి కన్నడ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ తారలు పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ తారలు ఈ సభలో పాల్గొని.ఆయనకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఓ టాప్ హీరోకు అవమానం జరిగింది.ఇంతకీ తను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంస్మరణ కార్యక్రమానిక భారీ సంఖ్యలో సెలబ్రిటీలు హాజరయ్యారు.సభా ప్రాంగణం అంతా నిండిపోయింది.అయితే ఈ సందర్భంగా కన్నడ టాప్ హీరో దర్శన్ కి పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదరైంది.కన్నడ నాట అభిమానులు ఆయనను D బాస్ అని పిలుస్తారు.

టాప్ స్టార్ హీరోలలో ఆయన కూడా ఒకరు.అయితే ఈ సభకు ఆయన కాస్త ఆలస్యంగా వచ్చాడు.

దీంతో ఆయనను పోలీసులు గేటు దగ్గరే ఆపారు.లోపల సభా ప్రాంగణం నిండిపోయిందని.

కూర్చోవడానికి సీట్లు లేవన్నారు.దయచేసి వెళ్లిపోవాలన్నారు.

అయితే దర్శన్ కాసేపు లోపలికి వెళ్లి మళ్లీ బయటకు వస్తానని చెప్పాడు.కూర్చోకపోయినా ఫర్వాలేదు.

నిల్చొని చూస్తానని చెప్పాడు.అయినా పోలీసులు వినలేదు.

Telugu Darshan, Karnataka, Kannada, Kannada Darshan, Yedyurappa-Movie

అదే సమయంలో దర్శన్ తో పాటు మరికొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు.చాలా సేపు పోలీసులతో మాట్లాడిన తర్వాత ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు.అనంతరం దర్శన్ ను లోపలికి తీసుకెళ్లారు.అయినా లోపలు సీట్లు లేకపోవడంతో సాధారణ ప్రేక్షకుల మధ్యలోనే కూర్చున్నాడు.అయితే అక్కడ ఇబ్బంది కలగడంతో ఆయన కాసేపటికి వెళ్లిపోయాడు.దర్శన్ పోలీసులతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పోలీసుల తీరును చాలా మంది తప్పుబడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube