బాలయ్య మూవీ ట్రైలర్ లో చిరంజీవి.. ఏమైందంటే..?

సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణల మధ్య కొన్నేళ్ల క్రితం వరకు విపరీతమైన పోటీ ఉండేదనే సంగతి తెలిసిందే.చాలా సందర్భాల్లో చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు పండుగల సమయంలో పోటాపోటీగా విడుదలయ్యాయి.

 Hero Chiranjeevi And Vijayasanthi Acted In Balakrishana Movie Aditya 369 Trailer-TeluguStop.com

కొన్నిసార్లు చిరంజీవి పైచేయి సాధిస్తే మరి కొన్నిసార్లు బాలకృష్ణ పైచేయి సాధించారు.అయితే బాలకృష్ణ నటించిన ఒక సినిమా ట్రైలర్ లో చిరంజీవి, విజయశాంతి నటించారు.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య369 ట్రైలర్ కోసం చిరంజీవి పని చేశారు.దూరదర్శన్ లో ఆదిత్య 369 సినిమా యొక్క గొప్పదనం చెబుతూ ప్రసారమైన ట్రైలర్ లో చిరంజీవి, విజయశాంతి నటించారు.

ఆ ట్రైలర్ కోసం చిరంజీవి స్పెషల్ కేర్ తీసుకుని కాన్సెప్ట్ ను డిజైన్ చేసుకుని మరీ నటించడం గమనార్హం.సైన్స్ ఫిక్షన్ మూవీ అయిన ఆదిత్య 369 బాలకృష్ణకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీ కృష్ణదేవరాయలు పాత్రలో నటించారు.అప్పట్లో ఈ సినిమా ఏకంగా కోటీ 60 లక్షల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

టైమ్ మిషన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ఎంతోమంది అభిమానులు ఇష్టపడుతున్నారు.

Telugu Aditya Trailer, Akhanda, Anil Ravipudi, Balakrishna, Boyapati Srinu, Chir

మరోవైపు బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది.బాలయ్య ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో నటించనున్నారు.

బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలతో పాటు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక సినిమాలో నటిస్తుండగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube