లేటెస్ట్ బజ్ : త్వరలోనే చరణ్ పూజా రొమాంటిక్ సాంగ్ !

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఆచార్య.ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కి స్తున్నాడు.చిరంజీవి 152 వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది.ఈ సినిమాలో చిరంజీవి సరసన మరొకసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆచార్య సినిమాను కొరటాల శివ సామజిక అంశాలతో రూపొందిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తి అయ్యింది.

 Charan Pooja Romantic Song Release Soon From Aacharya Movie, Acharya, Chiranjeev-TeluguStop.com

చివరి దశలో ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూట్ ను వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉంటే మే నెలలోనే ఈ సినిమా విడుదల అయ్యి ఉండేది.

కానీ షూట్ వాయిదా పడడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ వాయిదా వేశారు.ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడడంతో మళ్ళీ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలకమైన సిద్ద పాత్రలో నటిస్తున్నాడు.

Telugu Acharya, Charanpooja, Chiranjeevi, Kajal Agarwal, Shiva, Pooja Hegde, Ram

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు 45 నిముషాల పాటు ఉంటుంది.ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.పూజ హెగ్డే రామ్ చరణ్ సరసన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కొద్దీ సమయం కనిపించి ప్రేక్షకుల్ని అలరించ బోతుంది.

ఇందులో రామ్ చరణ్, పూజ హెగ్డే మీద ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని అందరికి తెలిసిన విషయమే.ఇప్పుడు అదే పాటపై ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Acharya, Charanpooja, Chiranjeevi, Kajal Agarwal, Shiva, Pooja Hegde, Ram

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన లాహే లాహే పాట ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు.ఇప్పుడు ఈ సినిమా నుండి రామ్ చరణ్, పూజా రొమాంటిక్ సాంగ్ కూడా త్వరలోనే మన ముందుకు రాబోతుందని అందుకోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.షూట్ పూర్తి చేసుకుని ఈ పాటను విడుదల చేయాలనీ టీమ్ అనుకుంటున్నారట.మరి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రొమాంటిక్ పాట ఎప్పుడు విడుదల చేస్తారో త్వరలోనే అధికారికంగా అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube