సెంటిమెంట్‌లో బాలయ్య

నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్‌’ తర్వాత మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.‘లెజెండ్‌’ తర్వాత బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయంగా సక్సెస్‌ అయ్యాడు.

 Balakrishna Following Legend Sentiment-TeluguStop.com

ఆ తర్వాత తన తాజా చిత్రం ‘లయన్‌’తో మరోసారి సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాలని తాపత్రయ పడుతున్నాడు.సత్యదేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లయన్‌’ ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటుంది.

ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్‌ ఖరారు చేశారు.

ఈ సినిమా విడుదలలో బాలయ్య సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నాడు.

తన గత చిత్రం ‘లెజెండ్‌’ మార్చి 28న విడుదల అయ్యింది.ఆ సినిమా ఘన విజయం సాధించింది.

దాంతో ఇప్పుడు బాలయ్య మళ్లీ అదే డేట్‌న తన తాజా చిత్రం ‘లయన్‌’ను కూడా విడుదల చేసి సక్సెస్‌ కొట్టాలని ఆశ పడుతున్నాడు.అయితే ఈ డేట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

త్వరలో బాలయ్య లేక చిత్ర యూనిట్‌ ఈ సినిమా విడుదల డేట్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా త్రిష మరియు రాధిక ఆప్టేలు నటిస్తున్నారు.

నందమూరి ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube