అభిమానికి ఫోన్ చేసి దైర్యం చెప్పిన బాలయ్య?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య అంటే ఆ క్రేజే వేరు.ఆయనకున్న అభిమానులు కూడా అంతా ఇంతా కాదు.

 Hero Balakrishna Talk To Fan-TeluguStop.com

ఇక ఆయన సినిమాలంటే ఎదురుచూడకుండా ఉండరు.ఆయన వ్యక్తిత్వం పట్ల గురించి ఎక్కువగా ఆయనతో కలిసి నటించిన వాళ్ళే చెబుతారు.

ఇప్పటివరకు ఆయనతో నటించిన కొందరు నటులు ఆయన గురించి పలు ఇంటర్వ్యూలలో చాలా సార్లు తెలిపారు.ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని.ఎవరు ఏ సహాయం అడిగిన వెంటనే కాదనకుండా తీరుస్తారని ఇలా ఎన్నో విషయాలు పంచుకున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ అభిమాని కి ఫోన్ చేసి మరి ధైర్యం చెప్పాడు.

 Hero Balakrishna Talk To Fan-అభిమానికి ఫోన్ చేసి దైర్యం చెప్పిన బాలయ్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్య ఇండస్ట్రీలోనే కాకుండా బయట తన అభిమానులతో కూడా బాగా సన్నిహితంగా ఉంటాడు.ఇప్పటికే ఎంతో మంది అభిమానులకు తన వంతు సహాయం చేశాడు.ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గొల్లపల్లికి చెందిన బాలయ్య అభిమాని మురుగేష్.అతని వయసు 23 సంవత్సరాలు.

అతను కొన్ని రోజుల క్రితం చెట్టు మీద నుంచి కిందకు పడటంతో అతని నడుముకు తీవ్రమైన గాయాలు ఏర్పడ్డాయి.ఇక అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు.

Telugu Balakrishna, Phone Call, Talking To Fan, Tollywood-Movie

ఈ నేపథ్యంలో బాలయ్య తన అభిమానికి నేరుగా ఫోన్ చేసి ఆప్యాయత గా మాట్లాడాడు.అతని ఆరోగ్య బాగోగులు గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడాడు.ఇక అతను మంచానికే పరిమితం కావడంతో తల్లి కూలిపనులకు వెళ్ళవలసి వస్తుందని తెలిపాడు.దీంతో బాలయ్య తన అభిమాని బాధ చూడలేక ఆదేశాల మేరకు వెంటనే రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తన అభిమానులతో పంచుకున్నాడు.అంతేకాకుండా బాలయ్య తనకు గతంలో జరిగిన ప్రమాదాల గురించి తన అభిమానితో పంచుకొని.

ధైర్యంగా ఉండటంతో తిరిగి కోరుకున్నా అంటూ తన అభిమాని మురుగేష్ కు ధైర్యం చెప్పాడు బాలయ్య.బాలయ్య మంచితనం చూసి అభిమానులే కాకుండా నెటి జనులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

#Phone Call #Talking To Fan #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు