అది ఎన్టీఆర్ కాలిగోటితో సమానం.. బాలయ్య కీలక వ్యాఖ్యలు..?

సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.గత నెల మే 28వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సైతం సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 Hero Balakrishna Sensational Comments On Bharat Ratna Award For Senior Ntr-TeluguStop.com

అయితే బాలకృష్ణ మాత్రం భారతరత్న సీనియర్ ఎన్టీఆర్ కాలిగోటికి సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.బాలయ్య తాజాగా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ ఛానల్ ఇంటర్య్వూకు హాజరైన బాలకృష్ణ యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో భాగంగా భారతరత్నపై కీలక వ్యాఖ్యలు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ వందల సంఖ్యలో సినిమాల్లో నటించడంతో పాటు రాజకీయ నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు.

 Hero Balakrishna Sensational Comments On Bharat Ratna Award For Senior Ntr-అది ఎన్టీఆర్ కాలిగోటితో సమానం.. బాలయ్య కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం గురించి ఇప్పటికే పలు విజ్ఞప్తులను పంపడం జరిగింది.

Telugu Balakrishna Sensational Comments, Bharat Ratna Award, Bharata Ratna Award, Chiranjeevi, Hero Balakrishna, Interesting Comments, Jr Ntr Political Entry, Mokshagna, No Bharata Ratna To Ntr, Senior Ntr-Movie

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే దిశగా అడుగులు వేయడం లేదు.బాలయ్య తాజాగా సీనియర్ ఎన్టీఆర్ మహానుభావుడని ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.అయితే ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా భారతరత్న కాలిగోటికి కూడా సరిపోదంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Balakrishna Sensational Comments, Bharat Ratna Award, Bharata Ratna Award, Chiranjeevi, Hero Balakrishna, Interesting Comments, Jr Ntr Political Entry, Mokshagna, No Bharata Ratna To Ntr, Senior Ntr-Movie

తండ్రి గురించి గొప్పగా చెప్పే క్రమంలో బాలయ్య నోరు జారారని వినిపిస్తోంది.మరోవైపు బాలయ్య ఎన్టీఆర్ జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొస్తానని వెల్లడించారు.ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా చేయడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందని బాలకృష్ణ వెల్లడించారు.మరోవైపు బాలయ్య ఇంటర్య్వూలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి, మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి.

#BharataRatna #JrNtr #Chiranjeevi #Mokshagna #NoBharata

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు