అమ్మ బాబోయ్ : బాలయ్య బాబు ఏకంగా ఆ జిల్లా కలెక్టర్ ని లవ్ చేస్తున్నాడంట...

తెలుగులో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోయిన్లుగా తెలుగు యంగ్ హీరోయిన్ “ప్రగ్యా జైస్వల్” మరియు పూర్ణ లు నటిస్తుండగా తమిళ ప్రముఖ నటుడు శరత్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

 Bb 3 Update Hero Balakrishna Fall In Love With District Collector In Bb 3 Movie,-TeluguStop.com

అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనుల నిమిత్తం చిత్ర యూనిట్ సభ్యులు కర్ణాటక రాష్ట్రంలోని దండేలి అడవులకు వెళ్లినట్లు సమాచారం.కాగా ఇందులో భాగంగా దాదాపు ఐదు రోజుల పాటు దండేలి అడవులలో షూటింగ్ నిర్వహించనున్నారట.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ విషయం ఏమిటంటే హీరో నందమూరి బాలకృష్ణ తో జిల్లా కలెక్టర్ ప్రేమలో పడ్డాడని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా జైస్వల్ ఓ జిల్లా కలెక్టర్ పాత్రలో నటిస్తోందని, ఆమె నిజాయితీ మరియు చేసేటువంటి మంచి పనుల కారణంగా నందమూరి బాలకృష్ణ ఆమె ప్రేమలో పడతాడని ఈ చిత్రంలో వీరి ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు హైలెట్ గా నిలువనున్నాయని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ చిత్ర అప్డేట్ల గురించి తెలియడంతో పండగ చేసుకుంటున్నారు.

Telugu Balakrishna, Balakrishnalove, Bb, Boyapati Srinu, Dharma, Balakrishnafall

ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 50 శాతం చిత్రీకరణ పనులు పూర్తి అయినప్పటికీ ఈ చిత్ర టైటిల్ విషయంపై మాత్రం చిత్ర యూనిట్ సభ్యులుగానీ దర్శకుడు బోయపాటి శ్రీనుగానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు.దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు కొంతమేర దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను మోనార్క్ లేదా ధర్మ అనే రెండు టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube