అన్ స్టాపబుల్ షోతో బాలకృష్ణ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అన్నది మాత్రం నిజమని చెప్పాలి.ఇన్నాళ్లు బాలయ్యలోని ఒక యాంగిల్ మాత్రమే చూసిన ఆడియెన్స్ ఆయనలోని కామెడీ యాంగిల్ చూసి షాక్ అయ్యారు.
ఆహా లో చేసిన అన్ స్టాపబుల్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఫైనల్ ఎపిసోడ్ మహేష్ తో ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 1 కి ది ఎండ్ చెప్పారు.
అయితే ఇన్నాళ్లు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన బాలకృష్ణ కెరియర్ లో ఫస్ట్ టైం ఇలా ఓ రియాలిటీ టాక్ షో హోస్ట్ గా చేశారు.తనని తనకే కొత్తగా పరిచయం చేసింది ఈ అన్ స్టాపబుల్ షో అని అన్నారు బాలయ్య.
అంతేకాదు సీజన్ చివరి ఎపిసోడ్ ముగిసిన తర్వాత అన్ స్టాపబుల్ షో గురించి.తనని ఆదరిస్తున్న ప్రేక్షకుల గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు బాలయ్య.సెట్ స్టెప్స్ మీద కూర్చుని బాలయ్య అభిమానులతో.ఆడియెన్స్ తో మాట్లాడిన తీరు సూపర్ అనిపించింది.
ఇన్నాళ్లు బాలకృష్ణ అంటే కేవలం ఒక కోణంలోనే ఆలోచించిన తెలుగు ఆడియెన్స్ ఆయన నిజమైన ప్రవర్తన చూసి ఇది కదా బాలయ్య అంటే అని అనుకుంటున్నారు.మొత్తానికి అన్ స్టాపబుల్ సీజన్ 1 కి అదిరిపోయే ముగింపు ఇచ్చారు ఆహా టీం.