అంతటి విషాదంలో ఈ హీరో పెళ్లి జరిగిందట.. కానీ ప్రస్తుతం...   

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన  “హాయ్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన టాలీవుడ్ హీరో ఆర్యన్ రాజేష్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఆర్యన్ రాజేష్ తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ మరణాంతరం కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకొని కొంత మేర తన సినిమా కెరీర్ పై దృష్టి సారించ లేకపోయాడు.

TeluguStop.com - Hero Aryan Rajesh And Suhasini Marriage News

కానీ తన భార్య సుభాషిణి ప్రస్తుతం తన కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తుండడంతో మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఆర్యన్ రాజేష్ భార్య సుభాషిణి గురించి పలు విషయాలను తెలుసుకుందాం… సుభాషిని హైదరాబాద్ కి  చెందినటువంటి ఓ ప్రముఖ కాంట్రాక్టర్ “క్రాంతిపూడి అమర్నాథ్” కూతురు.

TeluguStop.com - అంతటి విషాదంలో ఈ హీరో పెళ్లి జరిగిందట.. కానీ ప్రస్తుతం… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అప్పట్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో సుభాషిణితల్లిదండ్రులు బాగానే స్థిరపడ్డారు. దీంతో తెలిసిన వారి ద్వారా సుభాషిణి ని చూడడానికి దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వెళ్లగా మొదటి పెళ్లి చూపుల్లోనే ఆర్యన్ రాజేష్ కి మంచి జోడీ అని సంబంధం ఖాయం చేసేసాడు.

కానీ పెళ్లి జరిగే లోపే ఈవీవీ సత్యనారాయణ అనుకోకుండా హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్ను మూశాడు.అయినప్పటికీ తన తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసం ఆర్యన్ రాజేష్ సుభాషిణి నిపెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం వీరిద్దరూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.కాగా  ప్రస్తుతం ఆర్యన్ రాజేష్ కి ఒక పాప, బాబు కూడా ఉన్నారు.

ఈ విషయం ఉండగా ఇటీవలే ఆర్యన్ రాజేష్ తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన  “వినయ విధేయ రామ” అనే చిత్రంలో హీరో రామ్ చరణ్ కు అన్నయ్య పాత్రలో నటించాడు. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే కలెక్ట్ చేసింది.

 అయితే ఆ మధ్య ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆర్యన్ రాజేష్ తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే విలన్ గా కూడా నటిస్తానని తెలిపాడు.

#HeroAryan #AryanRajesh #Aryan Rajesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు