ఘనంగా హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం… ఫోటోలు వైరల్!
TeluguStop.com
ప్రముఖ నటుడు అర్జున్ ( Arjun )పెద్ద కుమార్తె ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.
కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు తంబి రామయ్య (Thambi Ramaiah) కుమారుడు, హీరో ఉమాపతి ( Umapathy Ramaiah )తో ఆమె ఏడడుగులు వేయనున్నారంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ విషయం వీరి పెద్దలకు తెలియడంతో వీరి పెళ్లికి అనుమతి ఇచ్చారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.
ఈ విధంగా అర్జున్ కుమార్తె ఐశ్వర్య ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఎక్కడా కూడా అర్జున్ స్పందించలేదు.
"""/" /
అయితే తాజాగా అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య ( Aishwarya Arjun) కు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించారని తెలుస్తోంది.
తాను ప్రేమించినటువంటి వ్యక్తి ఉమాపతి తోనే తన కుమార్తె నిశ్చితార్థం ( Aishwarya Arjun Engagement ) ఎంతో ఘనంగా జరిపించారని తెలుస్తుంది.
ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీరిద్దరి నిశ్చితార్థం శుక్రవారం చెన్నై( Chennai )లో కుటుంబ సభ్యులు అత్యంత సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిందని తెలుస్తుంది.
అయితే వీరి నిశ్చితార్థానికి సంబంధించినటువంటి ఫోటోలను కుటుంబం కానీ తంబి రామయ్య కుటుంబం కాని సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.
"""/" /
అయితే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు( Aishwarya Arjun Engagement Photos ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.
అదేంటి స్టార్ హీరోలు అందరూ ఏమాత్రం చడి చప్పుడు లేకుండా తమ కూతుర్ల నిశ్చితార్థం చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
గత రెండు రోజుల క్రితం హీరో వెంకటేష్ కూడా తన రెండవ కుమార్తె నిశ్చితార్థం కూడా ఇలా సైలెంట్ గా జరిగిపోయిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా అర్జున్ కుమార్తె ఐశ్వర్య తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పీరియడ్స్ లో నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి!