ఏంటీ అల్లు అర్జున్ మెగా హీరో కాదా... ఆ మీటింగ్ తో తేల్చి చెప్పిన అభిమానులు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.చిత్ర పరిశ్రమలో చిరంజీవి ఒక వటవృక్షం అని చెప్పవచ్చు.

 Allu Arjun Is Not A Mega Hero Fans Given Clarity With That Meeting Details,  All-TeluguStop.com

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.టాలీవుడ్లో టాప్ స్టార్స్ లో సగానికి సగం మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే ఉన్నారు.

ఇక మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా పలువురు హీరోలు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.ఇలా ఒక్కొక్క హీరో తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా హీరో కాదా అన్న చర్చ మొదలయింది.తాజాగా విజయవాడలోని చిరు, పవన్, రామ్ చరణ్ అభిమాన సంఘాల అధ్యక్షులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

ఆవేశానికి సంబంధించిన బ్యానర్ లో అల్లు అర్జున్ ఫోటో లేకపోవడం, అంతేకాకుండా అల్లుఅర్జున్ అభిమానులకు ఆహ్వానం కూడా లేకపోవడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అంతేకాకుండా అల్లు అర్జున్ మెగా హీరో క్యాటగిరి నుండి తొలగించినట్లు కూడా అయ్యింది.

పరోక్షంగా మెగాహీరో అన్న టాక్ అల్లు అర్జున్ కి వర్తించదని నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.అయితే ఇదేదో ఆషామాషీ సమావేశం అనుకుంటే పొరపాటు పడినట్లే.

Telugu Allu Arjun, Fans, Chiranjeevi, Ram Charan, Sai Tej, Swami, Tollywood, Var

ఎందుకంటే ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది.ఈ పరిణామంతో నిజంగా మెగాఫ్యాన్స్ లో చీలిక తెచ్చేదే అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే అల్లుఅర్జున్ కోరుకుంటుంది కూడా ఇదే కావడం గమనార్హం.ఎందుకంటే గత ఐదేళ్లలో అల్లుఅర్జున్ ఇమేజ్ భారీగా పెరగడమేకాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది.

Telugu Allu Arjun, Fans, Chiranjeevi, Ram Charan, Sai Tej, Swami, Tollywood, Var

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మెగా హీరో అని పిలిపించుకోవడానికి ఇష్టపడడం లేదు.అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.తన తాతయ్య అల్లురామలింగయ్య,చిరంజీవి కంటే ముందుగా నటుడిగా నిర్మాతగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బలమైన శక్తిగా ఎదిగారు.అంతేకాకుండా చిరంజీవి అల్లు రామలింగయ్య అల్లుడు కావడం వల్లనే తయారయ్యాడు అన్న వాదన కూడా ఉంది.

ఈ విషయంపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.మెగా అభిమానులు హీరోలు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube