సుకుమార్ ను భరిస్తున్న బన్నీ.. అసలేమైందంటే..?

2020లో అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో పుష్పరాజ్ అనే పాత్రలో నటిస్తున్నారు.ఆర్య, ఆర్య 2 సినిమాల్లో అల్లు అర్జున్ ను క్లాస్ గా చూపించిన సుకుమార్ ఈ సినిమాలో మాత్రం అల్లు అర్జున్ ను ఊరమాస్ గా చూపిస్తున్నారు.

 Hero Allu Arjun Hard Working For Pushpa Movie, Ala Vaikunthapuram Lo, Allu Arjun-TeluguStop.com

లారీ డ్రైవర్ గా పని చేస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు.అయితే

సుకుమార్

అల్లు అర్జున్ ను ఈ సినిమా కోసం ఒక రేంజ్ లో టార్చర్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సుకుమార్ పుష్పరాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ ను చాలా కష్టపెడుతున్నారని అయితే బన్నీ మాత్రం ఓపికగా భరిస్తున్నారని తెలుస్తోంది.అయితే సినిమా ఔట్ పుట్ కోసం సుకుమార్ బన్నీని కష్టపెడుతున్నా బన్నీ మాత్రం ఓపికగా సీన్లలో ఎటువంటి మార్పులు చెప్పకుండా తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒకే షాట్ ను వేర్వేరు యాంగిల్స్ లో ఔట్ పుట్ నచ్చిన విధంగా వచ్చేంత వరకు షాట్ ను ఓకే చేయడం లేదని సమాచారం.

Telugu Allu Arjun, Allu Arjun Hard, Arya, Errachandanam, Pushparaj Role, Sukumar

యూనిట్ సభ్యుల్లో కొంతమందికి కరోనా నిర్ధారణ కావడంతో మారేడుపల్లి నుంచి హైదరాబాద్ కు చేరుకున్న పుష్ప టీమ్ ఇక్కడ కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తోంది.కరోనా విజృంభణ నేపథ్యంలో సుకుమార్ సైతం పుష్ప సినిమా షూటింగ్ ను వీలైనంత ఫాస్ట్ గా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.బన్నీ 20 ఏళ్ల కెరీర్ లో ఏ సినిమాకు పడనంత కష్టం ఈ సినిమా కోసం పడుతున్నారని సమాచారం.

అయితే సుకుమార్ పై ఉన్న అభిమానం, సుకుమార్ సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం పడే తపన అల్లు అర్జున్ తెలుసు కాబట్టి పుష్పరాజ్ పాత్ర కోసం అల్లుఅర్జున్ ఎంతో కష్టపడుతున్నాడని తెలుస్తోంది.అల్లు అర్జున్ పడిన కష్టం ప్రేక్షకులకు తెరపై కనిపించనుంది.2021 సమ్మర్ టార్గెట్ గా పుష్ప సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube