ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్న సినిమాల కంటే ఫెయిల్యూర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్న సినిమాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఏజెంట్ ( Agent ) మూవీ అక్కినేని అభిమానులకు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది.80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 8 కోట్ల రూపాయల కలెక్షన్లను సైతం సొంతం చేసుకోలేదు.
ఈ సినిమాకు సురేందర్ రెడ్డి ( Surender Reddy ) దర్శకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఏజెంట్ సినిమా ఫలితం గురించి స్పందించిన అఖిల్ ( Akhil ) సురేందర్ రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఏజెంట్ సినిమా రిలీజ్ తర్వాత సురేందర్ రెడ్డి మీడియాకు దూరంగా ఉంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సురేందర్ రెడ్డి సినిమా కెరీర్ లో కిక్2 తర్వాత ఆ రేంజ్ డిజాస్టర్ అంటే ఏజెంట్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.
తల, తోక లేని కథనంతో తెరకెక్కిన ఏజెంట్ అక్కినేని ఫ్యాన్స్ ను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.అఖిల్ ఈ సినిమా రిజల్ట్ గురించి స్పందిస్తూ ఏజెంట్ మూవీ కోసం పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లకు థ్యాంక్స్ అని ఆ మూవీ బయటకు రావడం వెనుక వీళ్ల కృషి ఎంతో ఉందని అఖిల్ వెల్లడించారు.ఏజెంట్ సినిమా కోసం అందరూ బెస్ట్ వర్క్ ఇచ్చారని అయితే మూవీ స్క్రీన్ పై అంతగా కనబడలేదని ఒక మంచి మూవీ ఇవ్వలేకపోయానని అఖిల్ పేర్కొన్నారు.
నిర్మాత అనిల్ సుంకరకు స్పెషల్ థ్యాంక్స్ అని నిర్మాత అనిల్ సుంకర ( Anil Sunkara ) తనకి ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ అని అఖిల్ కామెంట్లు చేశారు.ఈ సినిమా హక్కులను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లకు, మీడియా వాళ్లకు థ్యాంక్స్ అని ఆయన పేర్కొన్నారు.నన్ను నమ్మిన వాళ్లకు చెప్పేది ఒకటేనని ఒక స్ట్రాంగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అఖిల్ అన్నారు.సురేందర్ రెడ్డిపై అఖిల్ కోపంగా ఉన్నారని అందుకే ఆయన పేరును ఎక్కడా ప్రస్తావించలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.