ఇస్మార్ట్ శంకర్ కథ తనదే అంటున్న ఒకప్పటి హీరో ఆకాష్  

Hero Akash Copy Allegations On Puri Jagannath Ismart Shankar Movie -

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ మంచి హిట్ సొంతం చేసుకని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న హీరో రామ్ పాత్ర తీర్చిదిద్దిన విధానం ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యింది.

Hero Akash Copy Allegations On Puri Jagannath Ismart Shankar Movie

దీంతో గతంలో వచ్చిన బిజినెస్ మెన్ తరహాలో సినిమా చూస్తున్న ప్రేక్షకులు రామ్ పాత్రకి కనెక్ట్ అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా విపరీతంగా కనెక్ట్ అయిపొయింది కొత్తతరం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో ఈ సినిమా కోట్ల రూపాయిలు కొల్లగోడుతుంది.

ఇక వరుస ఫ్లాప్ ల తర్వాత ఇస్మార్ట్ శంకర్ పూరీ జగన్నాథ్ ఆకలి తీర్చింది.ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కినా పూరీ నెక్స్ట్ సినిమాని పెద్ద హీరోతో ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ కథ తనదే అంటున్న ఒకప్పటి హీరో ఆకాష్-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఈ సినిమా కథ తనది అంటూ ఒకప్పటి హీరో ఆకాష్ ఇప్పుడు మీడియా ముందుకి రావడం సంచలనంగా మారింది.ఇదే కాన్సెప్ట్ తో తెలుగు-తమిళ భాషల్లో తను తయారు చేసిన కథ, కథనాలతో తనని హీరోగా పెట్టి రాధ అనే మహిళా దర్శకురాలు ఒక సినిమా తీశారని, అది తమిళంలో నాన్ యార్ అనే పేరుతొ విడుదల అయ్యిందని, దీనిని తెలుగులో కొత్తగా ఉన్నాడు టైటిల్‌తో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్న సమయంలో ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ రావడం తనని షాక్ కి గురి చేసిందని మీడియా ముందుకి వచ్చి అంటున్నాడు.

ఈ విషయంలో పూరీతో మాట్లాడే ప్రయత్నం చేసిన కుదరలేదని, దీంతో తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చాడు.ఈ విషయంలో తనకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతా అని ఆకాష్ అంటున్నాడు.

మరి ఈ నేపధ్యంలో ఇస్మార్ట్ శంకర్ కాపీ గొడవ ఎంత వరకు ఎల్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Akash Copy Allegations On Puri Jagannath Ismart Shankar Movie- Related....