అజిత్ సినిమా కోసం కన్నతండ్రిని చంపాలనుకున్నాడు.. చివరికి?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే ఎంతో మంది అభిమానులు ఉంటారు.వారి అభిమాన హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకొని ఎంతో హంగామా సృష్టిస్తారు.

 Hero Ajith Fan Named Ajith Kumar Wanted To Kill Father For Not Giving Money To Watch Ajith Viswasam Movie-TeluguStop.com

అదేవిధంగా వారి సినిమాని మొదటి రోజే మొదటి షో చూడాలని కొంతమంది పట్టుబడుతూ ఉంటారు.ఇలా సెలబ్రిటీల పట్ల ఎంతో అభిమానం చూపెడుతూ ఉండటం మనం చూస్తున్నాము.

ఒక్కోసారి మితిమీరిన అభిమానం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది.అలాంటి కోవకు చెందినదే ఈ సంఘటన.

 Hero Ajith Fan Named Ajith Kumar Wanted To Kill Father For Not Giving Money To Watch Ajith Viswasam Movie-అజిత్ సినిమా కోసం కన్నతండ్రిని చంపాలనుకున్నాడు.. చివరికి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ హీరో అజిత్ సినిమా చూసేందుకు డబ్బులివ్వలేదనే కోపంతో కన్న తండ్రినే చంపేందుకు సిద్ధమయ్యాడు ఓ కుమారుడు.ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది.

అజిత్ కుమార్ అనే యువకునికి హీరో అజిత్ అంటే ఎనలేని అభిమానం.అతని ఏ సినిమా విడుదలైనా మొదటిరోజే తప్పక చూసేవాడు.ఎప్పటిలాగే ఆ వారం కూడా అజిత్ సినిమా విశ్వాసం సినిమా రిలీజైంది.ఎలాగైనా ఆ తన అభిమాన హీరో సినిమా చూడాలని నిశ్చయించుకున్నాడు.

వెంటనే తన తండ్రిని ఆ చిత్రం చూసేందుకు డబ్బులు కావాలని అడుగగా అతను నిరాకరించాడు.ఎంత బతిమాలినా తన తండ్రి డబ్బులివ్వకపోవడంతో కోపంతో రగిలిపోయిన అజిత్.

తండ్రిపై కక్ష పెంచుకున్నాడు.ఇంట్లోకి వెళ్లి పెట్రోలు తెచ్చి తండ్రిపై పోసి, నిప్పంటించాడు.

వెంటనే స్పందించిన తన తండ్రి మంటలను ఆర్పేశాడు.

Telugu Ajith Fan, Ajith Fan Ajith Kumar, Ajith Kumar, Ajith Movie, Ajith Viswasam Movie, Kill Father, Kollywood, Not Giving Money, Petrol, Police Arrest, Tamilnadu, Vellore, Viswasam Movie-Movie

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగి తన ముఖం కాలిపోగా.స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్చారు.అజిత్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

దీంతో ఆ యువకునిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.ఒక్కోసారి మితిమీరిన ఇష్టం, అభిమానం ఆ వ్యక్తిని ఏ పనైనా చేసేటట్టు చేస్తుంది.

కాబట్టి పిల్లలు పెరిగే విధానం, అలవాట్లపై తల్లిదండ్రులు ఎప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సంఘటనను బట్టి తెలుస్తోంది.

#Money #Ajith Kumar #Ajith Viswasam #AjithFan #Father

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు