ఈ ఫోటోలో సైక్లింగ్ చేస్తున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా..?

సాధారణంగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సోలోగా రోడ్లపైకి రావడానికి పెద్దగా ఇష్టపడరు.అయితే సింపుల్ గా ఉండటాన్ని ఇష్టపడే అజిత్ మాత్రం ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ చేస్తూ సందడి చేస్తున్నారు.

 Hero Ajith Cycling Photos Goes Viral In Social Media, Ajith, Cycling Photos, Vir-TeluguStop.com

అజిత్ సైక్లింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సొషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అజిత్ వాలిమై సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో వాలిమై సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.అజిత్ కు జోడీగా ఈ సినిమాలో హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు.

హైదరాబాద్ రోడ్లపై అజిత్ బ్లాక్ ఔట్ ఫిట్ లో ముఖాన్ని కవర్ చేస్తూ సందడి చేయగా ఆయన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.సినిమాల్లోకి రాకముందు అజిత్ హైదరాబాద్ నగరంలో బైక్ మెకానిక్ గా పని చేశారన్న సంగతి తెలిసిందే.

Telugu Ajith, Bony Kapoor, Vinod, Huma Khureshi, Hyderabad, Ramoji, Valimai-Movi

అజిత్ నగరంలో ముఖ్యమైన ప్రాంతాలలో సైకిల్ తొక్కారు.అజిత్ తో పాటు అతని స్నేహితులు కూడా సైకిల్ రైడ్ చేసినట్టు తెలుస్తోంది.వయస్సు పెరుగుతున్నా ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే అజిత్ క్లీన్ షేవ్ తో కనిపించారు.వీలు కుదిరిన ప్రతిసారి హైదరాబాద్ కు వస్తుంటారు.ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.అజిత్ గత సినిమా నెర్కొండ్ పార్వై కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

మరోవైపు వాలిమై సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్లు లేకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.త్వరలో వాలిమై ఫస్ట్ లుక్ విడుదల కానుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube