నువ్వేం హీరో అని కామెంట్లు చేస్తూ బాధపెట్టారు.. హీరో ఆదిత్య కీలక వ్యాఖ్యలు!

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ఆదిత్య తనకంటూ మంచి గుర్తింపు, పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య నిర్మాతగా, దర్శకుడిగా, పాటల రచయితగా వేర్వేరు రంగాల్లో రాణించారు.

 Comments On Hero Aditya Goes Viral In Social Media , Comments Goes Viral, Hero-TeluguStop.com

కెరీర్ తొలినాళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలను అందుకున్న ఆదిత్య ఆ తర్వాత రోజుల్లో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.

ఆదిత్య మాసాబ్ అనే ఒక హిందీ మూవీ డైరెక్టర్ గా వ్యవహరించడం గమనార్హం.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య మాట్లాడుతూ లాహిరి లాహిరి లాహిరిలో షూటింగ్ సమయంలో వైవీఎస్ చౌదరి స్నేహితులు వచ్చి ఈ అబ్బాయి దొరికాడా మీకు ముంబైలో అని కామెంట్లు చేశారని అప్పుడు కొంచెం బాధగా అనిపించిందని చెప్పుకొచ్చారు.నూటికి నూరు శాతం ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాననే నమ్మకంతో ఈ ఇండస్ట్రీకి వచ్చానని ఆదిత్య తెలిపారు.

నువ్వు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కంటే బెటర్ అని ప్రోత్సహిస్తూ వైవీఎస్ చౌదరి యాక్టింగ్ చేయించుకునే వారని ఆదిత్య పేర్కొన్నారు.అమితాబ్ బచ్చన్ సినిమా చూసి ఈ ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నానని ఆదిత్య వెల్లడించారు.

సినిమా అనేది మ్యాజిక్ అని ఆదిత్య పేర్కొన్నారు.మా ఫాదర్ సివిల్ సర్వెంట్ అని ఆయన లైఫ్ లో నేను అన్నీ చూసి ఆ లైఫ్ నాకు కరెక్ట్ కాదనుకుని పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చదివానని ఆదిత్య వెలడించారు.

Telugu Aditya-Movie

సినిమాల్లోకి వస్తానంటే మమ్మీ సపోర్ట్ చేసిందని నాన్న ఎక్కువగా సపోర్ట్ చేయలేదని ఆదిత్య అన్నారు.రిలేటివ్స్ లో ఇండస్ట్రీకి ఎవరూ టచ్ లేరని ఆదిత్య పేర్కొన్నారు.నేను సినిమాలపై ఇంత ఆసక్తితో ఉన్నానని పేరెంట్స్ అనుకోలేదని ఆదిత్య వెల్లడించారు.ఆదిత్య చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube