సైలెంట్ గా సినిమా చేసేసిన అడవి శేష్!  

రెజినాతో మూవీ ఫినిష్ చేసిన అడవి శేష్. .

Hero Adavi Sesh Finished Thriller Movie-hero Adavi Sesh,regina,telugu Cinema,tollywood

ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ మొదలెట్టినప్పటి నుంచే సినిమా ప్రమోషన్ అయ్యేలా చూస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే షూటింగ్ ప్రారంభానికి ముందే హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక చిన్న సినిమాలు అయితే ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడం ద్వారా సినిమా గురించి అందరికి తెలిసేలా చేస్తూ ఉంటారు..

సైలెంట్ గా సినిమా చేసేసిన అడవి శేష్!-Hero Adavi Sesh Finished Thriller Movie

అయితే తాజాగా హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మళ్ళీ హీరోగా సక్సెస్ ట్రాక్ ఎక్కినా అడవి శేష్ తాజాగా ఎలాంటి గుట్టు చప్పుడు కాకుండా ఓ సినిమా పూర్తి చేసాడని తెలుస్తుంది.పివిపి నిర్మాణంలో రెజినా హీరొయిన్ గా ఒక థ్రిల్లర్ మూవీ అడవి శేష్ హీరోగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు మిగిలిన వివరాలు ఒకే సారి ప్రకటించే విధంగా ముందే ప్లాన్ చేసుకోవడంతో ఇన్నాళ్ళు సినిమా గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డట్లు తెలుస్తుంది.

ఇంకో రెండు మూడు నెలల్లో దీన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో వినిపిస్తుంది. గత ఏడాది గూడచారి సీక్వెల్ తో పాటు మహేష్ బాబు సోనీ సంస్థల సంయుక్త నిర్మాణంలో మేజర్ కూడా చేస్తున్నాడు. ఈ రెండు కంప్లీట్ చేయడానికి కొంత టైం పడుతుంది.

ఆ లోపు మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శేష్ పైన చెప్పిన థ్రిల్లర్ పూర్తి చేసినట్టు సమాచారం.