మరో కొత్త సినిమా స్టార్ట్ చేసిన అది సాయి కుమార్. ఈ సారి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో

సాయి కుమార్ తనయుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆది సాయి కుమార్.మొదటి సినిమా ప్రేమ కావాలితో హిట్ కొట్టిన ఆది సాయి కుమార్ తరువాత అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.

 Tollywood Hero Aadi Saikumar New Movie Launched, Tollywood, Telugu Cinema, Sai K-TeluguStop.com

హీరోగా అవకాశాలు వస్తున్న కూడా ఇమేజ్ ని పెంచుకునే విధంగా బ్లాక్ బస్టర్ మూవీ మాత్రం పడటం లేదు.కెరియర్ ఆరంభంలో చేసిన ప్రేమ కావాలి, లవ్ లీ సినిమాల తర్వాత సాలిడ్ హిట్ అయితే ఇప్పటి వరకు పడలేదు.

ఎక్కువగా యాక్షన్ ని నమ్ముకొని కమర్షియల్ జోనర్ సినిమాలు చేస్తూ ఉండటం తో అది సాయి కుమార్ కి సరైన హిట్ పడటం లేదనే టాక్ ఉంది.పదేళ్ళ కాలంలో అతని కెరియర్ కేవలం రెండు హిట్ సినిమాలు మాత్రమే ఉండటం గమనార్హం.

రీసెంట్ గా శశి అనే లవ్ స్టొరీతో ఆది సాయి కుమార్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో క్లిక్ కాలేదు.

ఇక తెలుగు, కన్నడ బై లింగ్వల్ మూవీగా జంగిల్ అనే సినిమా చేశాడు.ఈ సినిమా టీజర్ ఆ మధ్య రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.

అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆది సాయి కుమార్ మరో కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు.

భాస్కర్ బంటుపల్లి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇంతకాలం యాక్షన్, కమర్షియల్ కథలని నమ్ముకున్న ఆది ఈ సారి మాత్రం కాస్తా జోనర్ మార్చే ప్రయత్నం చేస్తున్నాడు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో ఈ సినిమా చేస్తున్నాడు.అలాగే కామెడీ ప్రధానంగా ఈ సినిమా కథాంశం ఉండబోతుందని తెలుస్తుంది.

సుకుమారుడు ఆది సాయి కుమార్ కామెడీ ట్రై చేశాడు.కామెడీ వర్క్ అవుట్ అయిన ఆ సినిమా ఎందుకో సక్సెస్ కాలేదు.

అయితే ఈ సారి లవ్ స్టొరీతో పాటు కామెడీకి పెద్ద పీట వేస్తూ సినిమా చేస్తూ ఉండటంతో తన ఫ్లాప్ ల ప్రహసనానికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నాడు.ఈ సినిమాలో సిమ్రాత్ కౌర్ ఆదికి జోడీగా నటిస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube