వాట్సప్‌లో సొంతంగా స్టిక్కర్స్‌ ఇలా తయారు చేసుకోవచ్చు.. మీ స్టిక్కర్స్‌ను మీరే చేసుకుని ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్‌ చేయండిలా  

Here\'s How You Can Create Your Own Whatsapp Stickers-own Whatsapp Stickers,personal Stickers,whatsapp

ఈమద్య కాలంలో వాట్సప్‌ ఏ స్థాయిలో మారు మ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇండియాలో స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కడు కూడా వాట్సప్‌ను తెగ వాడేస్తున్నాడు. భారీ ఎత్తున వినియోగదారులు ఉన్న కారణంగా వాట్సప్‌ కూడా కొత్త కొత్త ఫీచర్స్‌తో జనాలను ఆకర్షిస్తూనే ఉంది..

వాట్సప్‌లో సొంతంగా స్టిక్కర్స్‌ ఇలా తయారు చేసుకోవచ్చు.. మీ స్టిక్కర్స్‌ను మీరే చేసుకుని ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్‌ చేయండిలా-Here's How You Can Create Your Own WhatsApp Stickers

ఒకప్పుడు కేవలం టెక్ట్స్‌ మేసేజ్‌లకు మాత్రమే పరిమితం అయిన వాట్సప్‌ ఇప్పుడు ఎన్ని సేవలు అందిస్తుందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కొత్తగా వాట్సప్‌లో స్టిక్కర్స్‌ అంటూ వచ్చాయి. ఆ స్టిక్కర్స్‌ ఏమోజీలకు అడ్వాన్స్‌డ్‌ వర్షన్‌.

మన ఫీలింగ్‌ను ఇంకా గట్టిగా, బలంగా, రియలిస్టిక్‌గా చూపించేందుకు స్టిక్కర్స్‌ బాగా ఉపయోగపడుతున్నాయి. గతంలో ఏమోజీలను ఎక్కువగా వాడిన వాట్సప్‌ యూజర్లు ఇప్పుడు స్టిక్కర్లను పెద్ద ఎత్తున వాడుతున్నారు. స్టిక్కర్స్‌తోనే చాటింగ్‌ కానిచేస్తున్నారు.

అయితే వాట్సప్‌లో కొన్ని రకాల స్టిక్కర్స్‌ మాత్రమే ఉంటాయి, డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకున్నా కూడా కొన్ని మాత్రమే లభిస్తాయి. అయితే మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలతో స్కిక్కర్స్‌ లభించాంటే చాలా కష్టం.

అందుకే అలాంటి స్టిక్కర్లను తయారు చేసుకుంటే చాలా మజా వస్తుంది.

మన ఫీలింగ్స్‌ను అవతలి వారికి తెలియజేసేందుకు కొన్ని సార్లు ఏమోజీలు కాని, స్టిక్కర్స్‌ కాని లభించనప్పుడు మన సొంతంగా స్టిక్కర్లు తయారు చేసుకోవచ్చు. వాట్సప్‌ స్టిక్కర్ల తయారీ కోసం ఒక ప్రత్యేకమైన యాప్‌ వచ్చింది, అదే వాట్సప్‌ స్టిక్కర్‌ మేకర్‌. దీనికి గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకుని మూడు స్టెప్పుల్లోనే మీ సొంత స్టిక్కర్‌ను సులువుగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.

మొదట యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌ను ఓపెన్‌ చేసి, అందులో న్యూ స్టిక్కర్‌ను ఎంపిక చేసుకోవాలి, ఆ తర్వాత స్టిక్కర్‌ ప్యాక్‌, చేసేది ఎవరో పేరు టైప్‌ చేయాలి. కొన్ని టెంప్‌ ఫైల్స్‌ ఉంటే వాటిలోంచి మీకు కావాల్సిన టెంప్‌ ఫైల్‌ను ఎంపిక చేసుకుని, అందులో మీరు ఏదైతే ఫొటో అనుకుంటారో దాన్ని ఇన్సెర్ట్‌ చేయాలి. దాన్ని క్రాస్‌ చేస్తే మీ స్టిక్కర్‌ రెడీ అయినట్లే..

దాన్ని సేవ్‌ కొడితే డైరెక్ట్‌గా వాట్సప్‌ స్టిక్కర్ల జాబితాలోకి వెళ్లి పోతుంది. దాన్ని వాడేసిన తర్వాత వద్దనుకుంటే సులువుగా డిలీట్‌ చేసేయవచ్చు.

మరెందుకు ఆలస్యం మీ స్పెషల్‌ స్టిక్కర్‌ను తయారు చేసి, మీ స్నేహితులతో షేర్‌ చేసుకుని వారిని సర్‌ప్రైజ్‌ చేసేయండి, అలాగే ఈ సమాచారాన్ని స్నేహితులతో పంచుకునేందుకు షేర్‌ చేయండి.