Tata Nexo Mahindra XUV700 : 5-స్టార్ రేటింగ్ ఉండి తక్కువ ధరలోని కార్ల జాబితా ఇదే..

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తక్కువ ధరల్లో కార్లు కొనుగోలు చేస్తుంటారు.కానీ వీటిలో ప్రయాణాలు చేయడం ఎంత సురక్షితం? నిజానికి 10 లక్షల లోపు కార్లలో ప్రాణాలను కాపాడేంత భద్రత ఉంటుందా? అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతుంటాయి.అయితే కొన్ని కంపెనీలు ఇలాంటి సందేహాలు ఏమీ అవసరం లేకుండా గ్లోబల్ ఎన్‌సీఏపీలో 5-స్టార్ రేటింగ్‌ పొందిన కొన్ని కార్లను చాలా తక్కువ ధరల్లోనే విక్రయిస్తున్నాయి.వాటిలో టాప్ కార్లపై ఒక లుక్కేద్దాం.

 Here's A List Of 5 Star Rated Cars At Low Prices , Safest Cars, Budget Cars, Nca-TeluguStop.com

టాటా నెక్సాన్

ది బెస్ట్ బెల్ట్ క్వాలిటీతో రూ.7.54 ప్రారంభ ధరతో లభించే కారు టాటా నెక్సాన్.ఈ కారు గ్లోబల్ NCAP 5-స్టార్ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు దీనిని కొనుగోలు చేయవచ్చు.అలాగే ఇది లీటర్‌కి 21.5 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారు అడల్ట్స్ విషయంలో 5-స్టార్ రేటింగ్, పిల్లల విషయంలో 4-స్టార్ రేటింగ్‌తో వస్తుంది.ఇందులో భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఆఫర్ చేశారు.

ఎమర్జెన్సీ బ్రేక్‌, స్మార్ట్ పైలట్ అసిస్ట్‌ వంటి ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.ఈ కారు ధర రూ.13 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్ కారును జస్ట్ రూ.6.20లక్షలకే సొంతం చేసుకోవచ్చు.1399సీసీ ఇంజన్, లీటరుకు 25.11కి.మీ మైలేజ్, 5 స్టార్ రేటింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఇందులో అందించారు.

Telugu Cars, Budget Cars, Mahindra Xuv, Ncap, Safest Cars, Tata Altroz, Tata Car

టాటా పంచ్

5స్టార్ రేటింగ్‌తో వస్తున్న టాటా పంచ్ 5.82లక్షలకే మీరు సొంతం చేసుకోవచ్చు.NCAP లో ఇది 5స్టార్ రేటింగ్ సంపాదించింది.

డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్, ప్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఆటోమెటిక్ హెడ్ ల్యాంప్స్, టాప్ ట్రిమ్స్ వంటి ఎన్నో అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube