సాగు చట్టాలు: రైతుల అన్నదానానికి సాయం.. ఎయిర్‌పోర్ట్‌లోనే సిక్కు ఎన్ఆర్ఐ నిలిపివేత, దుమారం

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు కొన్ని నెలలుగా ఢిల్లీ శివార్లలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభిస్తోంది.

 Here Is Why Nri Darshan Singh Dhaliwals Entry Denial To India,darshan Singh Dhal-TeluguStop.com

విదేశాల్లోని ప్రవాసులు కూడా రైతులకు ఇంకా మద్ధతుగానే నిలబడుతుండటం విశేషం.అయితే వ్యవసాయ చట్టాల నేపథ్యంలో ప్రవాసులు రెండు వర్గాలుగా చీలిపోయారు.

వీరిలో ఒక వర్గం మోడీ సర్కార్‌కు, మరో వర్గం రైతులకు మద్ధతు పలుకుతున్న సంగతి తెలిసిందే.అన్నదాతల ఆందోళనకు తొలి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు వివిధ దేశాల్లోని ఎన్ఆర్ఐలు.

ముఖ్యంగా పంజాబ్, హర్యానాలకు చెందిన ప్రవాస భారతీయులు ఆయా దేశాల్లో ర్యాలీలు, ధర్నాలు చేయడంలో ముందుంటున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన భారత సంతతి శాస్త్రవేత్త దర్శన్ సింగ్ ధాలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను భారత్‌లో అడుగుపెట్టాలంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతుల కోసం లంగర్‌లను నిర్వహించడం తక్షణం నిలిపివేయాలని భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు తనకు చెప్పారని దర్శన్ వ్యాఖ్యానించారు.అక్టోబర్ 24న రాత్రి ఢిల్లీకి వచ్చినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను భారతదేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధించారని ఆయన చెప్పారు.

సింఘు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల కోసం లంగర్ నిర్వహించడం ప్రారంభించిన తర్వాత తాను జనవరి, ఏప్రిల్, అక్టోబర్‌లలో ఇండియాకు వచ్చినట్లు దర్శన్ చెప్పారు.

తాను భారతదేశానికి ఎప్పుడు వచ్చినా .రైతుల నిరసనలకు ఎందుకు మద్ధతు ఇస్తున్నారు.? లంగర్‌కు నిధులు ఎవరు ఇస్తున్నారని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను ప్రశ్నిస్తారని దర్శన్ ఆరోపించారు.తాను ఈ ప్రశ్నలను తేలికగా తీసుకున్నానని.తన కుటుంబంతో కూడా ఎప్పుడూ పంచుకోలేదని ఆయన చెప్పారు.అయితే ఈ నెలలో ధాలివాల్ అమెరికా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు మాత్రం దాదాపు రెండు గంటల పాటు అధికారులు ఆయనను వెయిట్ చేయించారు.

Telugu Darshansingh, Farmers, Nridarshan, Sikhs-Telugu NRI

ఈ సందర్భంగా తనను భారత్‌లోకి ప్రవేశించడానికి ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని తాను అడిగితే.ఇమ్మిగ్రేషన్ అధికారులు గతంలో అడిగిన ప్రశ్నలనే సంధించారని దర్శన్ చెప్పారు.భారత్‌కు రావాలనుకుంటే ఇకపై సింగూలోని లంగర్‌కు తక్షణం నిధులు ఇవ్వడం మానేయాలని వారు సూచించినట్లుగా ఆయన తెలిపారు.

దీని గురించి వివరాలు రాబట్టేందుకు తాను ప్రయత్నించగా.తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని వారు సమాచారం ఇచ్చారని దర్శన్ వెల్లడించారు.

మరోవైపు ఆయనను ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేయడంపై పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్.ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు.

ఎంతోమంది ఆకలి తీరుస్తున్న ధాలీవాల్‌ అడ్డుకోవడం అవమానించడమేనన్నారు.తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బాదల్ విజ్ఞప్తి చేశారు.

Telugu Darshansingh, Farmers, Nridarshan, Sikhs-Telugu NRI

కాగా.ధాలివాల్ తన తండ్రి జ్ఞాపకార్ధం ఈ ఏడాది జనవరి 6 నుంచి సింఘు సరిహద్దులో లంగర్‌కు నిధులు సమకూరుస్తున్నాడు.ఆయన 1972లో యూఎస్‌కి వలస వెళ్లారు.దర్శన్‌ అక్కడ 100కు పైగా పెట్రోల్, గ్యాస్ స్టేషన్‌లను నిర్వహిస్తున్నారు.2004లో తమిళనాడును వణికించిన సునామీ సమయంలో ఆయన సహాయక చర్యల కోసం విరాళాలు అందచేశారు.అంతేకాకుండా 1000 మంది విద్యార్ధులకు స్కాలర్‌షిప్ ఇచ్చి అండగా నిలబడ్డారు.

అమెరికాలో స్టార్టప్ ప్రారంభించేందుకు గాను 2000 మంది భారతీయులకు దర్శన్ సహాయం చేశారు.విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను నిర్మించేందుకు 1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.7,491 కోట్ల)ను విరాళంగా ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube