వైరల్ వీడియో: అక్కడ ఉన్నది నిజంగా దయ్యమేనా..?!

దెయ్యం గురించి చాల కథనాలు వినే ఉంటారు.ఇక ఊర్లో వీటిపై ఇంకా మూఢనమ్మకాలు ఉంటూనే ఉన్నాయి.

 Viral Video Is It A Real Devil There,  Devil, Viral Latest, Viral Video, Viral N-TeluguStop.com

అయితే కొన్ని సార్లు దెయ్యం వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి.అయితే అనగనగా ఓ ఇల్లు.

రాత్రి అయితే కనిపించే ఓ తెల్లటి ఆకారం.చీకటి పడితే వెన్నులో వణుకుపుడుతోంది.

ఇదంతా సినిమా కాదు యదార్ధ గాధ అంటున్నాడు ఆ ఇంటి ఓనర్. ఇంతకీ వారిలో భయానికి కారణమేంటి.? ఓనర్ ను వణికిస్తున్నదెవరూ.? ఇదే విషయాన్ని ఓనర్‌ ని అడిగితే చంద్రముఖి సినిమాను మించిన హర్రర్ స్టోరీ చెబుతున్నాడు.

పూర్తి వివరాల్లో వెళ్తే.యూకేకి చెందిన జోష్ డీన్ బెడ్ రూమ్ లో నిద్రిస్తున్న నా కుమార్తె ను దెయ్యం బెడ్ కిందకి లాగిందంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ప్రస్తుతం దెయ్యం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.జోష్ డీన్ చెప్పినట్లుగా.ఫిబ్రవరి 21న మా చిన్న పాప బొమ్మలతో ఆడుకుంటూ మంచం చివరిలో పడుకుంది.

కానీ.

రాత్రి 11:37 గంటలకు, రూమ్ లో వింత ఘటన చోటు చేసుకుంటుంది.అయితే ఆమె తన మంచం మీదనుండి లేచి కిందకు వెళ్లింది.

వెళ్లే సమయంలో పలుమార్లూ ‘మమ్మీ’ అని పలుసార్లు అరుస్తుంది.ఆమె అరుస్తున్నప్పుడు ఆమె కాళ్ళను ఎవరో పట్టుకొని కిందకు లాగినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.

గదిలో జరిగిన ఇన్సిడెంట్ అంతా మా ఇంట్లో ఉన్న సీసీ టీవీ పుటేజీలో రికార్డ్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.

ఇక ఆ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

నిద్రలేచిన పాప వాళ్ల మమ్మీ కోసం వెతుకుంది అని ఒకరంటుంటే మరొకరు అవును పాపకాళ్లని ఆ దెయ్యమే లాగుందని మరొకరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరు ఇంట్లో దెయ్యం నాకేం భయం అంటూ దెయ్యం లేదని కొట్టిపారేస్తున్నారు.

నిద్రలేస్తే పాప డైరెక్ట్ గా మంచం కిందకు ఎందుకు వెళుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఈ దెయ్యం వీడియో నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube