ATM లోకి ఇంకా కొత్త 500, 2000 నోట్లు ఎందుకు రాలేదంటే

డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల్లో బాగా బ్యాలెన్స్ ఉన్నవారు ఎలాగోలా లాకొచ్చెస్తున్నారు కాని, వాటిని వాడని పేద ప్రజలు, ప్రతీ అవసరాన్ని క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ తో తీర్చుకోలేని మధ్యతరగతి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ATM ఎక్కడో ఓ చోట తెరిచి ఉంటుంది.

 Here Is The Reason Why Atms Aren’t Able To Deliver New 500 And 2000 Notes-TeluguStop.com

అక్కడికి వెళితే గంటలకొద్ది క్యూలో నిలిచోవాలి.ఇక బ్యాంక్ కి వెళితే నరకమే.

సినిమాతారలను చూడ్డానికి వచ్చినట్లు ఎగబడుతున్నారు జనాలు.అటో ఇటో చేసి ATMకి వెళితే అందులో కొత్తనోట్లు ఉండట్లేదు.

కేవలం 100 రూపాయల నోట్లే.అవి కూడా అందరికీ అందట్లేదు.

మరి ఈ కొత్త నోట్లు ATM లోకి ఇంకా ఎందుకు రానట్లు? సమస్య ఏంటి అన్నట్లు? తెలుసుకుంటే చిన్న సమస్యేమి కాదు ఇది, పెద్దదే.పాత నోట్లకి, విడుదల చేసిన కొత్త నోట్లకి సైజులో తేడా ఉంది.

కొత్త నోట్ల సైజు 26% తక్కువగా ఉందంట.అందుకే ప్రస్తుతం ఉన్న ATM వాటిని విడుదల చేయలేకపోతున్నాయి.

దేశవ్యాప్తంగా 2 లక్షల ATMs ని ఇప్పుడు కొత్త నోట్లకి తగ్గట్టుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పడ్డారు.అందుకే ఈ ఆలస్యం జరుగుతోందని Cash Logistics Association of India అధ్యక్షుడు రితూరాజ్ సిన్హా చెబుతున్నారు.

ఇదే నిజమైతే, దేశంలో ఉన్న ATMs అన్ని ఎప్పుడు రెడీ కావాలి, కొత్త నోట్లు ఇబ్బంది లేకుండా ఎప్పుడు దొరకాలి, ప్రజల కష్టాలు ఎప్పుడు తీరాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube