ఎక్కువ మంది జాబ్‌ కావాలని ఎదురుచూసే సంస్థలు ఇవే!

మామూలుగా డిగ్రీ పట్టా పుచ్చుకోగానే మంచి కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెడతాం.లేదా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో జాబ్‌ వచ్చిందా.

 Here Is The List Of Top Ten Companies For Work. Apple, Google India, Ibm, Micros-TeluguStop.com

ఇక పండగే.కానీ, చాలా వరకు మంచి పేరున్న కంపెనీల్లో జాబ్‌ దొరకడానికి ఎదురు చూస్తాం.

ఎందుకంటే వాటిలో ఉద్యోగ భద్రత ఎక్కువ.పైగా జీతభత్యాలు కూడా అధికమే! ఇక ఏ చిన్నపాటి జాబ్‌ తాత్కాలికంగా చేసినా… మన దృష్టి మొత్తం మనస్సు పడ్డ సంస్థపైనే ఉంటుంది.

అల్టీమెట్‌గా కనీసం ఓ రెండు ప్రయత్నాలైనా చేస్తాం.కరోనా నేపథ్యంలో కూడా అందరి అభిరుచుల్లో కూడా మార్పుటు వచ్చాయి.

చాలా సంస్థల్లో జాబ్‌ కటింగ్‌ అయింది.అయితే, చాలా మంది ఏ ప్రముఖ కంపెనీల్లో జాబ్‌ కావాలని ఎదురు చూస్తున్న సంస్థల వివరాలు తెలుసుకుందాం.

దీనికి రాండ్‌స్టాడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ సర్వే జరిపింది.ఆ సర్వేలో అధికశాతం మంది ఎంచుకున్న టాప్‌ 10 కంపెనీల వివరాలు ఇవి!

ఈ జాబితాలో పదవస్థానంలో సోనీ ఇండియా ఉంది.

ఆ తర్వాతి 9వ స్థానంలో విప్రో ఉంది.ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టేన్సీ సర్వీసెస్‌ ఎనిమిదవ స్థానంలో ఉంది.

ఇంటర్నేష్‌నల్‌ బిజినెస్‌ మెషీన్స్‌ (ఐబీఎం) ఏడవ స్థానంలో ఉంది.

Telugu Amazon, Apple, Dell, Google, Google India, Infosys, Job Security, Microso

ఇక ఎక్కువ మంది ఉద్యోగార్థులు జాబ్‌ కావాలని ఎదురు చూసే సంస్థల్లో ఆరవ స్థానం దక్కించుకుంది ప్రముక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ డెల్‌.ఇక టాటా స్టీల్‌కు ఈ జాబితాలో ఐదవ స్థానం దక్కింది.ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌కు టాప్‌ 10 జాబితాలో నాల్గో స్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు జాబ్‌ కావాలని ఎదురు చూసే సంస్థల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ఈ జాబితాలో మూడవ స్థానం లభించింది.

Telugu Amazon, Apple, Dell, Google, Google India, Infosys, Job Security, Microso

ఇక ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజ కంపెనీ అమెజాన్‌ ఇండియా రెండో స్థానం దక్కించుకుంది.ఈ సంస్థ సమయంలో కూడా అనేక మందిని రిక్రూట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే! కేవలం పదవ తరగతి అర్హతతోనే ఈ సంస్థలో ఉద్యోగం లభించడంతో చాలా మంది ఈ సంస్థలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు.కరోనా నేపథ్యంలో కూడా ఈకామర్స్‌ దిగ్గజానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు.

ఇక ఇది వరకు, ఎప్పటికీ.ఇప్పటికీ మొదటి స్థానంలో నిలుచిన.

నిలిచిన సంస్థ గూగుల్‌ ఇండియా .ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఈ జాబితాలో మొదటి స్థానం సంపాదించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube