మీ శరీరంలో ఈ మార్పులు వచ్చాయా? అయితే.. విటమిన్ సి తగ్గినట్లే!

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలకు అలవాటు పడ్డారు.అందులో విటమిన్ ‘సి’ ది ప్రత్యేక స్థానం.

 Here Is The Importance Of Vitamin C, Covid, Metabolism, Immunity Power, Vitamin-TeluguStop.com

ఈ విటమిన్‌ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇది శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్‌.

ప్రస్తుతం ప్రాణాంతకంగా మారుతోన్న కరోనాతోపాటు ఇతర వ్యాధులతో పోరాడాలంటే సీ విటమిన్‌ తప్పనిసరి.ఈ విటమిన్ల వాడకం కరోనా నేపథ్యంలోనే ఎక్కువ శాతం పేరు      మారుమ్రోగుతోంది.

అప్పటి వరకు దీన్ని ప్రాధాన్యత తెలియని వారు కూడా మేలుకున్నారు .కోవిడ్‌ మొదటిలో కూడా పుల్లని ఆహార పదార్థాల్లో విటమిన్‌ సి  అధికంగా ఉంటుంది.దీనివల్ల కరోనా సులభంగా ఎదురుకోవచ్చని వైద్య నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే.సి విటమిన్‌ చాలా రకాల ఆహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటుంది.దీంతోపాటు విటమిన్ సి కి సంబంధించిన ట్యాబ్లెట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి.కానీ, సాధ్యమైనంత వరకు ఆహారం ద్వారా తీసుకోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఒకవేళ ఒంట్లో వేడి చేస్తే, శరీరంలో సి విటమిన్‌ స్థాయి తగ్గిపోతుంది.అందుకే తరచూ ఈ విటమిన్‌కు సంబంధించిన ఫుడ్‌ తింటూ.సి విటమిన్‌ స్థాయిని తగ్గకుండా చూసుకోవాలి.

సీ విటమిన్‌ పనితీరు

సాధారణంగా మనకు బ్యాక్టీరియా  ద్వారా రోగాలు సోకుతాయి.అవి ముఖ్యంగా కణాలపై దాడి చేస్తాయి.వీటి బారిన పడకుండా ఉండాలంటే.

మన శరీరంలో సి విటమిన్‌ ఫుడ్‌ తప్పనిసరి.ఈ విటమిన్‌ సరైన మోతాదులో ఉంటే వాటికి వ్యతిరేకంగా పోరాడతాయి.

దీనివల్ల మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.అంతేకాదు, విటమిన్‌ సి బాడీ మెటబాలిజంను పెంచుతుంది.

శరీరంలో ఏవి ఎంతెంత మోతాదులో ఉండేలా చేస్తూ… బాడీని బ్యాలన్స్‌ చేస్తుంది.విటమిన్‌ సి  స్ట్రెస్‌ను తగ్గించే గుణం ఉంటుంది.ముఖ్యంగా హైబీపీతో బాధపడేవారికి ఈ విటమిన్‌ చాలా ముఖ్యం.

విటమిన్‌ సీ ఉండే పదార్థాలు

నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి పుల్లగా ఉండే పండ్లు, కూరగాయాల్లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది.అదేవిధంగా రెడ్, యెల్లో క్యాప్సికంలలో కూడా సి  విటమిన్‌ ఉంటుంది.పదార్థాల్లో అయితే, అల్లం టీ తాగినా.

లేదా వంటకాల్లో వాడినా.అధిక ప్రయోజనం కలుగుతుంది.

బొప్పాయి తింటే కూడా సి  విటమిన్‌తో పాటు మీ జీర్ణక్రియ అద్భుతంగా మెరుగవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube