RC15 : నా రోల్ ఇలా ఉంటుంది అంటూ ఎగ్జైట్ అవుతున్న సునీల్!

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

 Here Is An Interesting Update On Shankar Ramcharans Rc15 2-TeluguStop.com

ఈ సినిమా తో హిట్ కొట్టిన చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్నాయి.ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.ఆ తర్వాత వైజాగ్ బీచ్ లో షూటింగ్ జరుపుకుంది.

ఇక ఇక్కడ కూడా షూటింగ్ అయిపోవడంతో నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తారో చూడాలి.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.అయితే తాజాగా సునీల్ ఈ సినిమాలో తన రోల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

ఆయన తన రోల్ ఎలా ఉండబోతుందో చెప్పుకొచ్చారు.

Telugu Shankar, Kiara Advani, Ram Charan, Rc, Sunil-Movie

ఈయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.తన రోల్ చరణ్ తో పక్కనే ట్రావెల్ అవుతుంది అని.తాను ఇప్పటి వరకు ఎప్పుడు చేయని ఒక హిలేరియస్ రోల్ ఈ సినిమాలో ఉంటుంది అని.శంకర్ తనకి చాలా మంచి పాత్ర ను డిజైన్ చేసారని ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చాడు.శంకర్ సినిమాల్లో యాక్షన్ ఎంత ఉంటుందో దానికి సమానంగా కామెడీ కూడా ఉండేలా చూసుకుంటాడు.

మరి సునీల్ రోల్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube