Silica Gel Packet: కొత్త చెప్పులు, వాటర్ బాటిల్స్ కొన్నప్పుడు కనిపించే ఈ ప్యాకెట్స్ ఏంటో తెలుసా

మనం ఏదైనా కొత్త షూలు, కొత్త బ్యాగ్‌లు, ఏదైనా గ్యాడ్జెట్స్‌ కొన్నప్పుడు వాటిలో కొన్ని ప్యాకెట్స్ కనిపిస్తుంటాయి.ఆ చిన్న సిలికా జెల్ ప్యాకెట్‌లను పెట్టడానికి ఒక కారణం ఉంది.

 Here Are The Different Uses Of Silica Gel Packets Details, Shoes, Water Bottle,-TeluguStop.com

సిలికా ఒక డెసికాంట్ అంటే ఇది తడి పీల్చే గుణం ఉంటుంది.ఇవి వాటి పరిసరాల నుండి తేమను గ్రహిస్తుంది.

ఈ ప్యాకెట్లలోని సూచనల ప్రకారం వాటిని వెంటనే విసిరేయాలని ఉంటాయి.అయితే మీరు వాటిని ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

అయితే పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తపడాలి.దీని వల్ల ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఒక్కోసారి ఫోన్ మనకు తెలియకుండా జారిపోతుంది.నీటిలో పడి పని చేయదు.

అలాంటి సందర్భాల్లో ఫోన్ నుండి తేమను పీల్చుకోవడానికి సిలికా ఉత్తమ మార్గం.

తొలుత ఒక మృదువైన గుడ్డ సహాయంతో దానిపై ఉన్న నీటిని తుడవాలి.

తర్వాత ఫోన్ విప్పి, లోపల సిలికాన్ జెల్ ప్యాకెట్‌ను పెట్టాలి.రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి ఉదయం ఆన్ చేయండి.

అంతేకాకుండా మీ షేవింగ్ బ్లేడ్‌లన్నింటినీ ఒక బాక్సులో భద్రపరుచుకోండి.దానిలో సిలికాన్ జెల్ ప్యాకెట్‌ను ఉంచండి.

బ్లేడ్‌లు ఎప్పటికీ పాడవ్వవు.ఎక్కువ కాలం ఉపయోగం కోసం అందుబాటులో ఉంటాయి.

వెండి వస్తువులకు ఇవి ఉపయోగపడతాయి.వాతావరణంలో తేమ ఉండటం వల్ల వెండి వస్తువులు సులభంగా మసకబారతాయి.

మీరు ఈ చిన్న సిలికాన్ జెల్ ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా దీన్ని సులభంగా నిరోధించవచ్చు.

Telugu Moisture, Shoes, Silica Gel, Latest, Bottle-Latest News - Telugu

లెదర్ బూట్లను తేమ నుంచి ఈ సిలికా జెల్ రక్షిస్తుంది.తేమ తోలును బాగా దెబ్బతీస్తుంది.మనం షూ బాక్స్‌ను కొనుగోలు చేసినప్పుడు దానిలో చిన్న ప్యాకెట్‌లను పొందేందుకు ఇది కారణం.

సిలికాన్ ప్యాక్‌లు తేమను చాలా కాలం పాటు నిలువ ఉంచుతాయి.వర్షాకాలం మరియు చలికాలంలో ఒక సాధారణ సమస్య ఏంటంటే కారు విండ్‌షీల్డ్‌పై పొగమంచు కారు లోపల తేమ కారణంగా మాత్రమే ఉంటుంది.

రెండు సిలికాన్ జెల్ ప్యాక్‌లను డ్యాష్‌బోడ్‌పై విండ్‌షీల్డ్‌కు దగ్గరగా ఉంచడం ద్వారా ఈ సమస్య వదిలి పోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube