సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరు భావిస్తారు.ఈ క్రమంలోనే జీవితంలో సంతోషంగా గడపాలంటే ఎంతో కష్టపడి పనులు చేసుకుంటూ డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటారు.
అయితే ఈ విధంగా కష్టపడి పని చేస్తున్నప్పటికీ ఆ ఇంటిలో సుఖసంతోషాలు లేకుండా ఉన్న వారు తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
మన ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్న అదేవిధంగా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలన్నా మన ఇంటికి ప్రధాన ద్వారం ఎంతో ముఖ్యం.
ఈ క్రమంలోనే మన ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎంతో అందంగా శుభ్రంగా ఉంచాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా స్వస్తిక్ గుర్తు ఉండటం వల్ల శుభం కలగడమే కాకుండా, మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించదు.
అలాగే ఇంటిలో పూజ కూడా అంతే ముఖ్యం పూజగది ఎల్లప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండే విధంగా చూసుకోవాలి.
అలాగే మరణించిన వారి ఫోటోలను ఎలాంటి పరిస్థితులలో కూడా దేవుని గదిలో ఉంచకూడదు.
అలాగే చాలామంది ఇంటికి మెట్లను నిర్మించుకొని మెట్ల కింద భాగంలో పడుకోవడం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు.ఇలా మెట్ల కింద భాగంలో పడుకోవడం పరమ దరిద్రం.అలాగే మన ఇంట్లో ఏమైనా చెడిపోయిన విరిగి పోయిన వస్తువులు ఉంటే వెంటనే వాటిని తొలగించాలి.అలాగే ఇంట్లో చెట్ల పెంపకం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎప్పుడూ కూడా చెట్టు నుంచి పాలుకారే మొక్కలు, ముల్లు కలిగిన మొక్కలను ఇంటి ఆవరణంలో పెంచుకోకూడదు.
ఈ విధమైనటువంటి వాస్తు చిట్కాలను పాటించడం వల్ల మన ఇంట్లో ఎల్లప్పుడు పాజిటివ్ వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యులు మొత్తం సుఖసంతోషాలతో గడుపుతారు.
LATEST NEWS - TELUGU