ఎవర్ గ్రీన్ అందాల భామ రేఖ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి తారలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వారి అద్భుతమైన నటనతో మాత్రమే కాకుండా అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో ఇప్పటికీ ఇతరులకు ఆదర్శంగా నిలబడతారు.

 Here Are The Some Interesting Facts About Actress Rekha Details,  Bollywood, Her-TeluguStop.com

అలా ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న అందాల నటి రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలోకి జెమినీ గణేషన్ పుష్పవల్లి దంపతుల కుమార్తెగా అడుగుపెట్టారు.

ఇలా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈమె ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నటి రేఖ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

రేఖ సినీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికి ఆమె ఇండస్ట్రీ లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు తనకి ప్రపంచాన్ని చుట్టేయడం ఇష్టం ఉండడంతో ముందుగా ఎయిర్ హోస్ట్ గా విధులు నిర్వహించి ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.అమితాబ్ బ‌చ్చ‌న్‌, ధ‌ర్మేంద్ర‌, శ‌త్రుఘ్న సిన్హా, జితేంద్ర‌, సంజ‌య్ ద‌త్ లాంటి స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

అయితే ఈమె కేవలం నటుడు దిలీప్ కుమార్ తో నటించే అవకాశం ఇంత వరకు రాకపోవడంతో ఈమెకు తీరని కోరిక అదొక్కటే ఉందని చెప్పాలి.

Telugu Dileep Kumar, Actress Rekha, Bollywood, Gemini Ganeshan, Jayamalini, Push

ఈమె కేవలం నటిగా మాత్రమే కాకుండా గొప్ప మిమిక్రీ ఆర్టిస్టుగా కూడా పేరు సంపాదించుకుంది.ఇండస్ట్రీలో రేఖ నీతు సింగ్‌కు, వారిస్‌లో స్మితా పాటిల్‌ వంటి వారికి ఈమె డబ్బింగ్ చెప్పేవారు.మేకప్ అంటే ఎంతో ఇష్టపడే రేఖ స్వయంగా తన మేకప్ తానే వేసుకుంటూ తనకు తానే డిజైనర్ గా వ్యవహరించుకునే వారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్ల మధ్య బేదాభిప్రాయాలు ఉంటాయి కానీ రేఖ మాత్రం నటి హేమామాలినితో ఎంతో చనువుగా మంచి స్నేహితురాలిగా ఉండేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube