Two hands writing : ఇక్కడ విద్యార్థులందరూ రెండు చేతులతో ఒకేసారి రాయగలరు.. ఎక్కడ అంటే..

సాధారణంగా ప్రజలు రైటింగ్‌కి తమ కుడి చేతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.కొందరిది ఎడమ వాటం ఉంటుంది.

 Here All The Students Can Write With Both Hands At The Same Time Where Does Tha-TeluguStop.com

చేతిరాత కుడి చేతితో అలవాటైన వారు ఎంత చక్కగా రాస్తారో ఎడమ చేతితో రాసే వారు కూడా అంతే అందంగా రాస్తారు.రాతలో చేతివాటాన్ని బట్టి కూడా క్రియేటివిటీ లెవెల్స్ ని చాలామంది అంచనా వేస్తుంటారు.

అయితే రెండు చేతులతో రాసే టాలెంట్ చాలా తక్కువ మందికే ఉంటుందని చెప్పొచ్చు.అదే రెండు చేతులతో ఒకేసారి రాసే టాలెంట్ కనిపించడం చాలా అరుదు.

అయితే మధ్యప్రదేశ్‌లోని సింగ్రులీ దగ్గర బుదేలి అనే గ్రామంలోని ఒక స్కూలు విద్యార్థులకు మాత్రం ఇది చాలా ఈజీ.

వివరాల్లోకి బుదేలిలో 1999 నుంచి వీణ వాదిని స్కూల్ నడుస్తోంది.ప్రిన్సిపల్ విరంగడ్ శర్మ ఈ స్కూల్ కి వచ్చిన సమయం నుంచి విద్యార్థులు విద్యను నేర్చుకునే తీరు పూర్తిగా మారిపోయింది.అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

విరంగడ్ వచ్చాక పిల్లలు హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్, ఉర్దూ, స్పానిష్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించారు.ప్రిన్సిపాల్ చొరవతో విద్యార్థులు ఇప్పుడు పైన పేర్కొన్న ఐదు భాషల్లో అనర్ఘళంగా మాట్లాడుతున్నారు.

అంతేకాదు.విద్యార్థులు ఒకేసారి రెండు చేతులతో రాసేలా ట్రైనింగ్ తీసుకొని ఈ స్కిల్‌లో నిష్ణాతులయ్యారు.

Telugu Madhya Pradesh, School, Unique-Latest News - Telugu

భారత మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఒకేసారి రెండు చేతులతో రాయగలరు.ఆయన్ని చూసే తాను కూడా తన పిల్లలకు ఇలాంటి స్కిల్ నేర్పించాలని డిసైడ్ అయినట్లు తెలిపారు.ప్రిన్సిపాల్ విరంగడ్ శర్మ రోజుకో గంట మెడిటేషన్, యోగా క్లాసులు కూడా పిల్లలకు ఇప్పిస్తుంటారు.ప్రస్తుతం ఈ పాఠశాల విద్యార్థులు కేవలం ఒకే ఒక్క నిమిషంలో 250 పదాలను ఒకేసారి రెండు చేతులతో రాయగలరు.1999 నుంచి ఇప్పటివరకు 480 మంది విద్యార్థులు రెండు చేతులతో రాయడంలో గొప్ప నైపుణ్యం సాధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube