కరోనా కాలం.. కషాయాలు ఆరోగ్యానికి మంచిదేనా?

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు కషాయాల వెంటపడుతున్నారు.దీన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు అలాగే కరోనాను నియంత్రించవచ్చని భావిస్తున్నారు.

 Herbal Teas Is Good For Health-TeluguStop.com

అయితే కషాయం తాగడం కొంతవరకు మాత్రమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కానీ శృతిమించి తాగడం వల్ల కొత్త రకం ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

కషాయం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

 Herbal Teas Is Good For Health-కరోనా కాలం.. కషాయాలు ఆరోగ్యానికి మంచిదేనా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా సమయంలో ప్రజలందరూ ఎక్కువగా అల్లం, మిరియాలు, లవంగం బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడానికి అలవాటు పడ్డారు.

ఇలాంటి కషాయాలు తాగడం వల్ల జలుబు, దగ్గు సమస్యల నుంచి విముక్తి పొందుతారు.ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఈ కషాయాన్ని రోజుకు ఒక గ్లాస్ తాగడం ద్వారా మాత్రమే ఈ ఫలితాలు కలుగుతాయి.అలా కాకుండా రోజుకు రెండు, మూడు గ్లాసులు తాగితే కొత్తరకం సమస్యలు తలెత్తుతాయి.

అల్లం, మిరియాలు, లవంగాలు ఇవన్నీ కూడా ఎంతో ఘాటుగా ఉండే పదార్థాలు.వీటిని రోజుకు రెండు మూడు గ్లాసులు తీసుకోవడం ద్వారా కడుపులో ఎక్కువగా మంట గ్యాస్ ఫార్మేషన్ జరుగుతుంది.

దీని వల్ల ఆహారం ఆకలి కాకపోవడం, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.

మెంతులను నానబెట్టి వాటిని డికాషన్ తాగడం వల్ల రక్తం పలచ పడవచ్చు అని చెబుతున్నారు.

కేరళకు చెందిన డాక్టర్ ఫిలిప్స్ కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇలాంటివి తీసుకోవడం ద్వారా మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

పసుపును పరిమితికి మించి వాడితే డయాబెటిస్ కంట్రోల్ తప్పవచ్చని, మధుమేహంతో లివర్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కషాయాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అలా కాకుండా పరిమితికి మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ తలెత్తుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

#Ayurvedic Teas #COVID-19 #Corona Virus #Herbal Teas

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు