'వాట్సాప్' వల్ల ఆ యువతి పెళ్లి ఆగిపోయింది.! అసలేమైందో తెలుస్తే నోరెళ్లబెడతారు.!  

Her Wedding Cancelled Due To Whatsapp-

వాట్సాప్‌.నేటి త‌రుణంలో ఇది మ‌న జీవ‌న విధానంలో ఎలా భాగం అయిందో అంద‌రికీ తెలిసిందే..

Her Wedding Cancelled Due To Whatsapp--Her Wedding Cancelled Due To WhatsApp-

నిత్యం ప్ర‌తి రోజూ, ప్ర‌తి గంట‌, ప్ర‌తి నిమిషం మ‌నం వాట్సాప్ ప్ర‌పంచంలో విహ‌రిస్తున్నాం.అనేక విష‌యాల‌ను అందులో షేర్ చేసుకుంటున్నాం.వాయిస్‌, వీడియో కాల్స్ చేసుకుంటున్నాం.

ఇంకా అనేక ఇత‌ర స‌దుపాయాల‌ను మ‌నం వాట్సాప్‌లో పొందుతున్నాం.అయితే ఈ విష‌యం మాటేమోగానీ ఈ వాట్సాప్ వల్ల ఓ యువతి పెళ్లి ఆగిపోయింది.అవును మీరు విన్నది నిజమే.

! ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని నౌగావ్ సాదత్ అనే గ్రామంలో జరిగింది.విపరీంతగా పెళ్లి కూతురు వాట్సాప్‌ను వాడడం వల్ల, పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు ,అమెతో పెళ్లి వద్దని వెళ్లిపోయారు.దీంతో పెళ్లి కూతురు కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు.

వివరాలలోకి వెళ్తే.పెళ్లి రోజు అన్నీ ఏర్పాట్లు చేసుకుని పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్న అమ్మాయి తరపువాళ్లకు ఊహించని షాక్ తగిలింది.పెళ్లి కొడుకు, అతని కుటుంబసభ్యులు, బంధువులు ఎంతకీ రాకపోవడంతో ఫోన్ చేసి ఆరా తీశారు.

వాళ్లు చెప్పిన కారణం విని పెళ్లి కూతురు, ఆమె బంధువులకు దిమ్మదిరిగిపోయింది.‘అమ్మాయి ఎప్పుడు చూసినా వాట్సాప్‌తోనే కాలక్షేపం చేస్తోంది.ఈ పెళ్లి మాకొద్దు’ అని చెప్పారు..

అయితే అసలు కారణం ఇది కాదు అని.వాళ్లు అడిగినంత కట్నం రూ.65 లక్షలు ఇవ్వనందుకే పెళ్లిరద్దు చేసుకున్నారని పోలీసులకు అమ్మాయి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు మాత్రం అమ్మాయి వాట్సాప్ ఎక్కువగా వాడుతోంది.పెళ్లికి ముందే తమకు మేసేజ్‌లు చేస్తోంది.అందుకే పెళ్లి రద్దు చేసుకున్నామని తెలిపారు.