ఈటీవీలో గత ఎనిమిదేళ్ల నుండి మంచి ఆదరణతో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే.ముఖ్యంగా అందులో పాల్గొనే కమెడియన్స్ తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు.
వెండితెరపై కూడా మెరుస్తున్నారు ఈ జబర్దస్త్ కమెడియన్లు.కేవలం జబర్దస్త్ వేదిక నుండి పరిచయమై ఎంతో వరకు దూసుకుపోతున్నారు.
పైగా ఒక్క షోతో కాకుండా మరిన్ని షో లలో కూడా జబర్దస్త్ కమెడియన్ ల హవా జోరుగా నడుస్తుంది.ఇక ఇందులో అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకున్న ఇమ్మానుయేల్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
బిగ్ బాస్ కోసం జబర్దస్త్ ను వదిలివెళ్లిన ముక్కు అవినాష్ స్థానంలో మరో కమెడియన్ గా ఇమ్మానుయేల్ వచ్చిన సంగతి తెలిసిందే.
మొదట్లో ఈయన కెవ్వు కార్తీక్ టీం లో కీలక పాత్రలో నటించాడు.
ఆ తర్వాత మరికొన్ని టీమ్ లలో కూడా చేసాడు.ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీం లో చేస్తున్నాడు.
పైగా మంచి మార్కులు కూడా కొడుతున్నాడు.గతంలో సుడిగాలి సుధీర్ కే పోటీ గా వచ్చాడని చెప్పాలి.
కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీ ప్లస్ లో ప్రతి ఆదివారం మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా చేస్తున్నాడు.ఇక జబర్దస్త్ లో ఆయన అంతగా గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం మరో బుల్లితెర ఆర్టిస్ట్ వర్ష అని చెప్పాలి.
వర్ష తో కలిసి బాగా పర్ఫామెన్స్ చేస్తుంటాడు.వీరిద్దరి కాంబినేషన్ వల్లే ఆ టీమ్ కు మంచి విజయం అందింది.
అంతేకాకుండా వీరి మధ్య జరిగే సన్నివేశాలు కూడా వీరు గానీ ప్రేమలో ఉన్నారా అన్నట్లు అనిపిస్తుంది.
అంతేకాకుండా షో బయట కూడా ఈ జంట బాగా సన్నిహితంగా కనిపిస్తుంది.పైగా గతంలో వీరి మధ్య సన్నివేశాలు బాగా అతిగా ఉన్నాయని ప్రేక్షకులనుండి కామెంట్లు కూడా ఎదురయ్యాయి.ఇప్పటికి కూడా వీరికి కామెంట్లు ఎదురవుతూ ఉంటాయి.
అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు.ఇక ఇదంతా పక్కన పెడితే ఇమాన్యుయేల్ అల్లరి ఆన్ స్క్రీన్ మీదనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా బాగా సందడిగా ఉంటుంది.
ఇతర ఆర్టిస్టులతో కలిసి బాగా రచ్చరచ్చ చేస్తుంటాడు.నిజానికి ఆయన వేదిక పైనే కాకుండా బయట కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు ఇమ్మానుయేల్.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటాడు.
ఇదిలా ఉంటే తాజాగా తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టాడు.అందులో ఓ నెటిజెన్ శ్రీముఖి గురించి అడగటంతో.
మంచితనం అందరిని కలుపుకుపోయే గొప్పతనం ఆమె గుణం.అంటూ మై స్వీట్ సిస్టర్ శ్రీముఖి అని స్పందించాడు.
దీంతో ఆయన చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.