సమంత ఇన్స్పిరేషన్ ఆమేనట.. అసలు విషయాన్ని బయటపెట్టిన సామ్!

Heorine Samantha Revealed Her Inspiration With Emotional Post Details

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.ఎందుకంటే అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అందనంత ఎత్తులో ఉంది.

 Heorine Samantha Revealed Her Inspiration With Emotional Post Details-TeluguStop.com

తొలిసారిగా ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.తన తొలి నటన తోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.తన అందంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.

 Heorine Samantha Revealed Her Inspiration With Emotional Post Details-సమంత ఇన్స్పిరేషన్ ఆమే నట.. అసలు విషయాన్ని బయటపెట్టిన సామ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మరింత గుర్తింపు సొంతం చేసుకుంది.

పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం అవకాశాలు తగ్గలేదు ఈ బ్యూటీకి.

కానీ కొన్ని రోజుల కిందట తన భర్త నాగచైతన్యతో విడిపోయింది.

ఇక ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారింది.విడాకుల తర్వాత సమంతలో చాలా మార్పులు వచ్చాయి.

పైగా సినిమాల విషయంలో కూడా బాగా దూసుకెళ్తుంది.ఎక్కడ కూడా అస్సలు తగ్గట్లేదు ఈ గ్లామర్ బ్యూటీ.

ఇటీవలే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో డీగ్లామర్ లుక్ తో సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది.ఇదంతా పక్కన పెడితే ఆమె ఒక నటిగానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా పలు బాధ్యతలు చేపట్టింది.పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉంది.ఇక సమంత తెగ వర్కౌట్లు కూడా చేస్తూ ఉంటుంది.నిజానికి ఆమె చేసే వర్కౌట్లు చూస్తే మతిపోవడం గ్యారెంటీ.

జిమ్ములో తాను చేసే వర్కవుట్లు చాలా హెవీ గా ఉంటాయి.ఎంత బరువైన సరే సులువుగా ఎత్తి పడేస్తుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆ మధ్య తెగ ఎమోషనల్ కొటేషన్ లను బాగా షేర్ చేసుకుంది.

ఇప్పటికి కూడా అలాంటివి బాగా పంచుకుంటూ ఉంటుంది.అంతేకాకుండా తనకు ఏదైనా ఇన్స్పైర్ గా అనిపిస్తే వెంటనే వాటిని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.

మామూలుగా సమంత తాను ఏదైనా కొత్తగా వర్క్ ఔట్ చేస్తే వెంటనే దానిని పోస్ట్ చేసే దాకా ఊరుకోదు.అలా తాజాగా తాను ఒక వర్కౌట్ చేయగా దానికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా లో పంచుకుంది.

ఇక ఆ వీడియోని చూసి పలువురు ఇన్స్పైర్ అయ్యి అచ్చం సమంత లాగా చేయాలని ప్రయత్నించారు.దాంతో అలా చేసిన వారి కొన్ని వీడియోలు తిరిగి తన ఇన్ స్టా లో పంచుకుంది.అందులో ఒక ఆవిడ కూడా అలాగే చేయగా ఆమెకు చేతులు లేకపోవటం విశేషం.దీంతో ఈ వీడియోని కూడా షేర్ చేసుకొని తన ఇన్స్పిరేషన్ ఆమెనే అని సమంత తెలిపింది.

ఇక సమంత ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.

Video : Heorine Samantha Revealed Her Inspiration With Emotional Post Details, Samantha, Tollywood, Heroine, Inspiration, Film Industry, Samantha Inspirations, Samantha Workouts, Naga Chaitanya, Pushpa, Special Song

#Samantha #Naga Chaitanya #Samantha #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube