ఏదైనా ఇతర దేశం వెళ్లాలంటే ఖచ్చితంగా పాస్ పోర్ట్, వీసా కావాలి.వీసా లేకుంటే ఇతర దేశాల్లోకి వెళ్లలేం.
అయితే కొన్ని దేశాల పాస్ పోర్ట్‌లతో మనం వీసా( Visa ) లేకుండానే ఇతర దేశాలకు వెళ్లొచ్చు.ఇలాంటి పాస్ పోర్టులు( Passport ) కలిగి ఉన్న దేశాలపై హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్( Henley Passport Index ) ఇటీవల సర్వే నిర్వహించింది.
దీని వివరాలను ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది.సింగపూర్‌ను( Singapore ) ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా ఆ సంస్థ పేర్కొంది.
ఆ దేశ పాస్ పోర్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా 192 ప్రయాణ గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్ ఉంది.ఆ తర్వాత స్థానంలో మూడు యూరోపియన్ దేశాలు జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఉన్నాయి.
ఈ దేశాల పాస్ పోర్ట్‌లతో 190 దేశాల్లో వీసాలు లేకుండా ప్రయాణించవచ్చు.ఇక ఇప్పటి వరకు ఈ జాబితాలో ఉండే జపాన్( Japan ) రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయింది.వీసా లేకుండానే వెళ్లగలిగే దేశాల సంఖ్య 189కి తగ్గిపోవడంతో జపాన్ ర్యాంకు కూడా పతనమైంది.3వ స్థానంలో ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాలు ఉన్నాయి.ఇక డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, యూకే నాలుగో స్థానాన్ని సంయుక్తంగా పంచుకున్నాయి.దాదాపు ఒక దశాబ్దం క్రితం ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానంలో ఉంది.
లిథువేనియా కూడా ఇదే ర్యాంకును కలిగి ఉంది.ఈ దేశాల పాస్ పోర్ట్‌లతో 184 దేశాలలో వీసా లేకుండా పర్యటించవచ్చు.ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) ర్యాంకింగ్‌లో అట్టడుగున ఉంది.దాని పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా కేవలం 27 దేశాల్లో మాత్రమే పర్యటించే వీలుంది.ఆ తర్వాతి స్థానంలో ఇరాక్, సిరియా దేశాలు ఉన్నాయి.ఇరాక్ పాస్ పోర్ట్‌తో 29, సిరియా పాస్‌పోర్ట్‌తో 30 దేశాలలో వీసా లేకుండా పర్యటించే వీలుంది.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ నుండి డేటాను ట్రాక్ చేస్తుంది.