ద్రాక్ష పండు సైజులో గుడ్లు పెడుతున్న కోడిపెట్ట..

గుడ్లు.ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ నోరూరుతుంది.ఇక బ్యాచులర్ రూంలో అయితే వీటికి కొదవే ఉండదు.ఇంట్లో దాదాపుగా పిల్లల నుంచి పెద్దల వారకు చాలా మంది వీటిని ఇష్టపడతారు.గుడ్లను ఉడకపెట్టిన సమయంలో ఇందులోని పచ్చ సొనను అందరూ బాగా ఇష్టపడతారు.మరి కోడి పెట్టే గుడ్డులో పచ్చసొన లేకపోతే పరిస్థితి ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా.అవునండి నిజమే కేరళలో ఓ కోడి పచ్చసొన లేకుండా గుడ్లు పెడుతోంది.అంది కూడా కేవలం ద్రాక్ష పండు సైజులోనే పెడుతోంది.

 Hen Laying Eggs The Size Of A Grapefruit , Amazing Hen, Viral Video-TeluguStop.com

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా.

కేరళలోని ఓ కోడి.ద్రాక్ష పండ్ల సైజులో గుడ్లు పెడుతోంది. మనపురం లోని సమద్ అనే వ్యక్తి ఇంట్లో కోడిపెట్ట ఇలా ద్రాక్ష పండు సైజులో గుడ్లు పెడుతోంది.ఈ కోడికి దాదాపు ఐదేళ్ల వయసుంది.

 Hen Laying Eggs The Size Of A Grapefruit , Amazing Hen, Viral Video-ద్రాక్ష పండు సైజులో గుడ్లు పెడుతున్న కోడిపెట్ట..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కోడి పెడుతున్న గుడ్లలో కేవలం తెల్లసొన మాత్రమే ఉంటోంది.పచ్చ సొన లేకపోవడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

గతంలో మామూలు సైజులోనే గుడ్లు పెట్టిన ఈ కోడి ఈ మధ్య కాలంలోనే ఇలా ద్రాక్ష పండు సైజులో గుడ్లు పెడుతోంది.ఇంట్లో ఉన్న మిగతా కోళ్లకు పెట్టే ఆహారాన్నే ఈ కోడికి సైతం పెడుతున్నానని చెబుతున్నాడు సమద్.

అయినా ఈ కోడి ఇలా వింతగా ద్రాక్ష పండు సైజు గుడ్లు పెడుతోందని చెబుతున్నారు.ఇలా ఇప్పటి వరకు 9 గుడ్లు పెట్టిందట ఆ కోడి.

ప్రస్తుతం ఈ గుడ్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఆ గుడ్లను చూసేందుకు చుట్టుపక్కల వారు సమద్ ఇంటికి వస్తున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube