పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు.. బిడ్డకు డిఫరెంట్ పేరు పెట్టిన తల్లి..

కొంతమంది పేర్లు వింటుంటేనే మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి.కానీ ఆ పేరు వెనకాల ఎలాంటి కథ ఉందో మనకు తెలియదు.

 Hemorrhoids While Writing The Test   The Mother Who Gave The Baby A Different Na-TeluguStop.com

ఇలా డిఫరెంట్ పేర్లు ఉన్న వారిని చాలా మందిని చూస్తూనే ఉంటాం.అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది.

ఈ ఘటన గురించి చెప్పాలంటే.జీవితంలో ముందుకు సాగాలన్నది ఆమె కల.అందుకోసం ఎంతో కష్టపడింది.ఆమెకు తన భర్త సైతం అండగా నిలబడ్డాడు.

గర్భం దాల్చినా కానీ పరీక్ష కోసం తన ప్రిపరేషన్ ఆపలేదు.ఇంతలో పరీక్ష రాసే టైం రానే వచ్చింది.

ఇక తన కల నెరవేరే టైం వచ్చిందని పరీక్షకు హాజరయింది.పరీక్ష రాస్తుండగానే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి.

దీంతో అక్కడే అందుబాటులో ఉన్న ఇన్విజిలేటర్లు ఆమెను ఆస్పత్రికి తరలించారు.సరైన టైంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.

ఓ బిడ్డకు సైతం జన్మనిచ్చింది.ఇంత వరకు బాగానే ఉన్నా.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.పరీక్ష టైంలో పురిటినొప్పులు రావడంతో ఆ బిడ్డకు డిఫరెంట్ పేరు పెట్టింది ఆ తల్లి.

అసలు వివరాల్లోకి వెళితే.నాన్ పుర్ బిటా గ్రామానికి చెందిన రేణు దేవి అనే మహిళకు గవర్నమెంట్ టీచర్‌గా మారి పిల్లలకు పాఠాలు చెప్పాలనే కల ఉండేది.

అందుకోసమే టెట్ (టీచర్ ఎలిజిబుల్ టెస్ట్)కు అప్లై చేసింది.తర్వాత బాగా ప్రిపేర్ అయి పరీక్ష రాసేందుకు రెడీ అయింది.తాజాగా టెట్ ఎగ్జామ్ రాసేందుకు సెంటర్‌కు వెళ్లింది.

ఎగ్జామ్ రాస్తుండగా మధ్యలో పురిటి నొప్పులు వచ్చాయి.దీంతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాలకు ఎలాంటి అపాయం కలగలేదు.

పైగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.పరీక్ష రాసే టైంలో అతడు పుట్టడంతో అతడికి ఆమె టెట్ అని పేరు పెట్టింది.

ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.పేరు మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది కదా.

Hemorrhoids While Writing The Test The Mother Who Gave The Baby A Different Name , Exams, Viral News, Baby, Different Name , Tet ,Nanpur Bita, Amreha Uttar Pradesh - Telugu Amrehauttar, Exams, Nanpur Bita

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube