ఆది పురుష్ లో ప్రభాస్ తల్లిగా అలనాటి అందాల తార.. ఎవరో తెలుసా?

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకోవడంతో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే వరుస సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” చిత్రంలో నటిస్తున్నట్లు ఇదివరకు తెలిసిందే.

 Hemamalini To Play A Role In Prabhas Adipurush, Adi Purush, Pan India,  Hemamali-TeluguStop.com

రామాయణ ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు.అదేవిధంగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నట్లు ఇది వరకు మనకు తెలిసిన విషయమే.

రామాయణ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమిత్ర , కైకేయి, కౌసల్య పాత్రలు ఎంతో కీలకమైనవి.ఈ సినిమా గురించి తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ పాత్రలో నటించడానికి సీనియర్ నటి హేమామాలిని చిత్ర బృందం సంప్రదించినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో హేమామాలిని రాముడి పాత్రలో ఉన్న ప్రభాస్ కు తల్లి పాత్రలో నటిస్తుందా లేక పిన తల్లి పాత్రలో నటిస్తోందా అనే విషయం గురించి స్పష్టత రాలేదు.ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారకంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నట్లు సమాచారం.

Telugu Adi Purush, Heavy Budget, Hemamalini, Mother, Pan India, Prabhas-Movie

ఆది పురుష్ సినిమా ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రూపంలో తెరకెక్కించనున్నారు.రామాయణ ఇతిహాసాల ప్రకారం తెరకెక్కుతున్న ఈ సినిమాలోని పాత్రలను దర్శకుడు ఏవిధంగా ప్రేక్షకులకు చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ చిత్రం తర్వాత ఆది పురుష్ చిత్రంలో పాల్గొననున్నట్లు సమాచారం.ఇప్పటికే ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube