నటి హేమకు టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.కామెడీ పాత్రలతో పాటు, కాస్త సీరియస్ పాత్రల్లో కూడా ఈమె ఇట్టే ఒదిగి పోతూ ఉంటుంది.
ఆ మధ్య ఈమె ప్రతి సినిమాలో కనిపిస్తూ వచ్చేది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈమె వరుసగా సినిమాల్లో నటించింది.
కాని గత కొంత కాలంగా ఈమెకు కాస్త అవకాశాలు తగ్గాయి.అందుకు కారణం మా ఎలక్షన్స్ అని అందరికి తెలిసిన విషయమే.
ఈమె మా ఎన్నికల సమయంలో కాస్త అతి చేసింది.మెగా హీరో నాగబాబుపైనే విమర్శలు చేయడంతో పాటు, ఆయన పరువు తీసింది.
ఆ సమయంలో మెగా ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు.
మెగా బ్రదర్‌ను విమర్శించినందుకు ఇప్పుడు ఈమెకు అవకాశాలు రాకుండా అయ్యాయి.
మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కోరుకునే వారు హేమను తమ సినిమాలోకి తీసుకోవాలంటే భయపడుతున్నారు.అందుకే నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది.
తాను చిరంజీవి కోసమే చెన్నై వెళ్లాను అని, ఆయన మద్దతుతోనే ఇంత నటి అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.చిరంజీవి 150వ సినిమాలో ఎలాగైన ప్లేస్ సంపాధించి, దర్శక నిర్మాతలను మళ్లీ తన ముందు క్యూ కట్టించుకోవాలి అనుకుంటుంది.
మరి ఈ ఆంటి కోరుకున్నది జరిగేనా, చిరును మెప్పించేనా చూడాలి.